సమంత.... 27ఏళ్ల ఈ అప్సరస ఇప్పుడు తెలుగు యూత్ కి మోస్ట్ ఫేవరెట్ గాళ్!
ఏప్రెల్ 28, 1987లో.... తెలుగు ఫాదర్ అండ్ మలయాళీ మదర్ కి ఈ లిట్టిల్
ఏంజెల్ పుట్టింది. ఈ రోజు సమంత పుట్టిన రోజ సందర్భంగా ఎపిహెరాల్డ్.కామ్
ప్రత్యేకంగా సమంతకు బర్ట్ డే విషెస్ ను చెబుతుంది. సమంత పుట్టినప్పటి నుంచీ
తమిళం మాట్లాడుతూ, తమిళుల మధ్యే వుండటం వల్ల... స్యామ్ తనని తాను తమిళియన్
గా భావిస్తుందట! వెల్.... తన నవ్వుతోనే కామం పుట్టించే ఈ కామర్స్
గ్రాడ్యూయేట్.... 2010లో తెలుగు సినిమాతో వెండితెర పైకొచ్చింది!
అక్కడ్నుంచీ ఇక ఆమె చేసే మాయకి అడ్డు అదపూ లేకుండా పోయింది.
2010లోనే కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది సమంత. మాస్కోవిన్ కావేరీ అనే
సినిమాతో తమిళ ప్రేక్షకులకి దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. బట్... తెలుగులోనే
మళ్లీ మళ్లీ విజయం వరించింది. బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో
సిరిమల్లె చెట్టు.... ఇలా టాలీవుడ్ బాక్సాఫీస్ కూడా సమంత సౌందర్యపు
శ్రీమంతానికి దాసోహం అనేసింది! మాతృభాష తమిళంలో ఇప్పటికీ సమంతకి బలమైన హిట్
రాలేదనే చెప్పాలి. అయితే, చెన్నైలో ఈమె క్రేజ్ తక్కువేం కాదు. తెలుగులో
వచ్చిన యెటో వెళ్లిపోయింది మనసు సినిమాకి ఒరిజినల్ వెర్షన్.... నీతానే ఎన్
పోన్ వాసంతం ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్ట్రస్ అవార్డ్ సాధించి పెట్టింది!
ఇక తెలుగులో మొన్నటికి మొన్న అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్
చేసిన సమంత గురించి ప్రత్యేకంగా చెప్పదేముంది? ఆమె మన నిర్మాతలకి గ్లామర్
రూపంలో కాసులు కురిపించే శృంగార లక్ష్మీ! తెలుగులో వివి వినాయక్
డైరెక్షన్లో ఒక సినిమా, ఎన్టీఆర్ సరసన మరో సినిమా చేస్తోన్న స్యామ్.....
మనం సినిమాతో మరో సారి నాగ చైతన్యతో రొమాన్స్ చేయనుంది. ఆటోనగర్ సూర్య కూడా
చేతూ, సమంతల ట్రైడ్ అండ్ టెస్టెడ్ కాంబినేషన్ తో రీలీజ్ కోసం ఎదురు
చూస్తోంది.
అయితే.... టాలీవుడ్లోనే కాదు... కోలీవుడ్లోనూ సూర్యతో అంజాన్, విజయ్ తో
కత్తి లాంటి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తోంది! అండ్ మోర్ హ్యాపియర్ న్యూస్
ఏంటంటే... తన మెంటార్... గౌతమ్ మెనన్ కోరిక మేరకు బాలీవుడ్ ఎంట్రీ కూడా
ఇస్తోంది ఈ సౌత్ క్యూటీ! గౌతమ్ నెక్స్ట్ చేయనున్న హిందీ మూవీలో సమంతే
హీరోయిన్! మరి... తెలుగు, తమిళ ఆడియన్స్ ని మాయ చేసినట్టు హిందీ జనాల్ని
కూడా ఈ గార్జియస్ గాడెస్ మాయ చేస్తుందా? సమంత 28త్ బర్త్ డే లోపు అదీ
తెలిసిపోతుంది! ఆల్ ది బెస్ట్ బేబ్.....