avika gor romance
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో అంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు పరిచయమైన నార్త్ ఇండియన్ భామ అవికా గోర్. అవికా గోర్ కు ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లోనూ క్రేజ్ పెరిగిపోతుంది. బుల్లితెరను మెప్పించిన అవిక గోర్ ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ సూపర్ సక్సెస్ సాధించటంతో అవికా గోర్ కు తెలుగు నుండి మరిన్ని మూవీల ఆఫర్స్ వచ్చాయి. అయితే వచ్చిన ప్రతీ మూవీకు అవికా గోర్ సైన్ చేయటం లేదు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందిన సమాచారం మేరకు అవికా గోర్ త్వరలోనే ఓ మెగా హీరోతో రొమాన్స్ చేయటానికి సిద్ధంగా ఉందట. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. ఉయ్యాలా జంపాల మూవీ తరువాత అవికాగోర్ ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాకి సైన్ చేసింది. తాజాగా ఈ బ్యూటి మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ కి సైన్ చేసింది . మురళీధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ లవ్ ఎంటర్టైనర్ ని ‘మేం వయసుకు వచ్చాం’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ నిర్మించిన బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నాడు. అలాగే అవికా గోర్ సరసన నూతన నటీనటులు నటించనున్నారు. ఈ మూవీల తరువాత అవికాగోర్ అల్లుశిరీష్ సరసన నటించే అవకాశాలు ఉన్నట్టు టాలీవుడ్ టాక్. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని డిటైల్స్ త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి అవికాగోర్, మెగాహీరో మూవీలో నటించిందంటే ఆ హీరోల సరసన వరుస పెట్టి మూవీలు చేసే అవకాశాన్ని సంపాదించినట్టే అని టాలీవుడ్ అంటుంది. ప్రస్తుతం అవిక గోర్ నటిస్తున్న ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమాలో నాగ సౌర్య హీరోగా నటిస్తున్నాడు.
 
Top