కేరళ కుట్టి నిత్యామీనన్ టాప్ హీరోలు ఎవరితోను నటించలేదు. నిత్యామీనన్
సినిమాలు చాల తక్కువే అయినా ఆమెకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అటువంటి
నిత్యా ఏకంగా మెగా ఫ్యామిలీ కే కండిషన్స్ పెట్టింది అనే వార్తలు
వస్తున్నాయి. గతంలో ‘అలా మొదలైంది’ తర్వాత ప్రభాస్, వెంకటేష్‌లతో వచ్చిన
మూవీ ఆఫర్స్ వదిలేసిన నిత్యా సెలెక్టివ్ రోల్స్ మాత్రమే చేస్తూ అడపాదడపా
కనిపిస్తోంది.
నితిన్‌కు గోల్డెన్ లెగ్ హీరొయిన్ గా బ్రాండ్‌పడిన నిత్యా, ఇతర హీరోలు
సిద్ధార్ధ్ - రోహిత్‌లతో మాత్రం ఫ్లాప్ హీరొయిన్ గా పేరు తెచ్చుకుంది.
ప్రస్తుతం ‘రుద్రమదేవి’లో స్పెషల్ రోల్ చేస్తున్న ఈమె మెగా ఫ్యామిలీ హీరో
అల్లు శిరీష్ జోడీగా న్యూ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే
అందుకు కొన్ని కండిషన్స్ పెట్టిందని టాక్.
ఎపి హెరాల్డ్ కు తెలుస్తున్న సమాచారం మేరకు మెగా ఫ్యామిలీ హీరో అని తన రోల్
తగ్గిస్తే ఊరుకోనని అంతేకాకుండా శిరీష్ తో ట్రయిల్ షూట్ చేసి కాంబినేషన్
బాగుందని అనిపిస్తే డేట్స్ ఇస్తానని ఆ సినిమా దర్శక నిర్మాతలకు గట్టి ఝలక్
ఇచ్చిందట.
మరి ఈ కండిషన్‌కు శిరీష్ ఒప్పుకుంటాడా లేదా మరో హీరోయిన్‌ని చూడామని
చెపుతాడా అనే విషయం పై ప్రస్తుతం ఫిలిం నగర్ లో ఆశక్తి నెలకొని ఉంది. రేపు
విడుదల కాబోతున్న ‘కొత్త జంట’ సినిమా రిజల్ట్ బట్టి బహుశా శిరీష్ ఈ విషయంలో
ఒక నిర్ణయానికి వస్తాడు అనుకోవాలి.