ఎన్నికలు వస్తే ఎన్ని కలలు ముంచుకొస్తాయో! రాజకీయ నాయకులంతా టిక్కెట్ల కోసం
కలలు కంటారు. కొందరు సినిమా వాళ్లు కూడా పొలిటికల్ డ్రీమ్స్
వేసేసుకుంటారు! అయితే, ఎన్నికల వేళ ఎన్నెన్నో కలలు మాత్రమే కాదు.... ఎన్నో
కళలు కూడా బయటకొస్తాయి! లేటెస్ట్ గా ఓటేయండంటూ ఓ హాట్ టాలీవుడ్ బేబ్...
తనలోని కళని బయటపెట్టింది! దానికి సంబంధించిన న్యూస్ ను www.telugucinemasamacharam.in
ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అచ్చమైన తెలుగు అమ్మాయి. కాకపోతే, తెలుగు
సినిమాల్లో మాత్రం లక్ కలిసి రాలేదు.
సూపర్ లుక్స్ అండ్ హాట్ గ్లామర్ మధు స్వంతం. అయినా కూడా ఆమె మధువు లాంటి
బ్యూటీ మన వాళ్లకి రుచించలేదు. ఆఫర్లు లేకున్నా మధు ఏదో ఒక రకంగా లైమ్
లైట్లో మాత్రం వుంటుంది. సెలబ్రిట్ క్రికెట్ మొదలు షాప్ ఓపెనింగ్స్ టైంలో
రిబ్బన్ కటింగ్స్ వరకు ఆమెపై కెమెరాలు ఫ్లాష్ అవుతునే వుంటాయి. ఇక తాజాగా
ఈమె చేసిన ఓ ఓటర్ అవేర్నెస్ యాడ్ పెద్ద చర్చగా మారింది! ఓటింగ్ కు కౌంట్
డౌన్ మొదలైపోవటంతో అందర్నీ వెళ్లి ఓటు వేయమని చెప్పింది మధు.
అయితే తను చేసే యాడ్ లో ఎక్కువుగా ఎక్స్ ఫోజింగ్ ఉందట. ఇప్పుడు అదే హాట్
టాపిక్ గా మారింది. ఒక మంచి విషయం చెప్పేప్పుడు... సెక్సీ జిమ్మిక్కులు
అవసరమా అంటున్నారు కొందరు! ఎవరి అభిప్రాయం కరెక్ట్ అంటే నిర్ణయం చేయటం
కష్టమే కాని... మధుశాలినీ లాంటి గ్లామర్ డాల్... ఇంత వెరైటీగా ఓటు
వేయమనటం... మంచి కిక్ నిచ్చే క్యాంపైనే అవుతుంది! మధుశాలిని హాట్ ఓట్
క్యాంపెయినింగ్ యాడ్ నెట్ దుమ్మరేపుతుంది.