వాళ్లిద్దరూ తమాషా చేయబోతున్నారు! వున్నట్టుండీ... మధ్యలో ఈ తమాషా ఏంటంటారా? తమాషా చేయబోతోన్న ఆ ఇద్దరూ మామూలు సెలబ్రిటీలు కాదు!చాలా హాట్ అండ్ హ్యాపెనింగ్ పెయిర్ ఆఫ్ బాలీవుడ్! అందుకే, వాళ్లు చేసే తమాషాకి అంత క్రేజ్! బాలీవుడ్స్ మోస్ట్ సెన్సేషనల్ కపుల్ రణబీర్, దీపిక ఓ సినిమా చేయనున్నారు. మూవీ పేరే తమాషా. దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. అసలు వీళ్ల ప్రణయ గాథ తెలియని సినీ జనం లేరు. చాలా రోజులు కలిసి తిరిగిన ఈ బచ్నా హై హసీనో జంట... పబ్లిగ్గా తమ లవ్ ని కన్ ఫామ్ చేశారు కూడా! దీపిక అయితే ఒంటిపైన టాటూ వేయించుకుని తన ఘాటు ప్రేమని ప్రదర్శించింది. కాకపోతే, పచ్చబొట్టు చెరిగిపోలేదు కాని పిచ్చి ప్రేమ తగ్గిపోయింది. బాలీవుడ్ అన్నాక ప్రేమలు పుట్టడాలు, ఆ ప్రేమల పుట్టి మునగడాలు సాధారణమే కదా అనుకుంటే పొరపాటే! ఎందుకంటే, చాలా మంది బాలీవుడ్ బ్రేకప్ కపుల్స్ కి, రణబీర్, దీపికల జోడీకి ఓ తేడా వుంది! నార్మల్ గా రొమాన్స్ చెడాక ఏ ఎక్స్ లవర్స్ కూడా కలిసి సినిమాలు చేయరు. పబ్లిక్ ఫంక్షన్స్ లో కూడా ఎడ మొహం, పెడ మొహమే!కాని, కపూర్ లాడ్లా రణబీర్ అండ్ బ్యాడ్ మింటన్ బేబీ దీపిక కంప్లీట్లీ ప్రొఫెషనల్! అందుకే, తమ ఎక్స్ రిలేషన్ షిప్ బాగా పబ్లిసిటీకి వాడుకుంటూ... యే జవానీ హై దివానీ చేశారు. ఇప్పుడు డైరెక్టర్ ఇంతియాజ్.. రణబీర్, దీపికల క్రేజీ కాంబినేషన్లో “తమాషా” సినిమాను చేయనున్నాడు. మొత్తానికి రణ్ భీర్ కపూర్, దీపికాల ప్రేమ మళ్ళీ చిగురించిందనే చెప్పాలి.
 
Top