salman khan jump
హీరోలు అంటే షూటింగ్ సమయంలో వారికి అంత రిస్క్ ఉండదు అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు సంబంధించిన టాప్ హీరో ఓ సాహసోపేతమైన స్టంట్ చేసి బిటౌన్ ఇండస్ట్రీను కంగారు పెట్టాడు. దీనికి సంబంధించిన న్యూస్ ను ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ మంచి కిక్కు ఇచ్చే పని చేశాడు. దాంతో తనకు కావల్సినంత కిక్కు వచ్చింది. చిత్రయూనిట్ వారు ఎంత వద్దన్నా కాదనకుండా సల్మాన్ ఖాన్ ఓ ఎతైన భవనం నుంచి దూకాడు. సల్మాన్ సేఫ్ గా కిందకు దూకటంతో చిత్రయూనిట్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నంత పనైంది . సల్మాన్ ఖాన్ ప్రసుతం టాలీవుడ్ కిక్ మూవీ రిమేక్ లో నటిస్తున్నాడు. ఈ మూవీకు సంబంధించి షూటింగ్ పోలండ్ దేశంలో జరుగుతంది. పోలండ్ దేశంలోనే ఎత్తైన ఓ భవనం 40 వ అంతస్తు నుంచి సల్మాన్ కిందకి దూకాడు. బంగీ జంప్ చేసి అంతెత్తు భవనం నుంచి తలకిందులుగా వేలాడాడు. ఇది పోలండ్ లోని అత్యంత ఎత్తైన భవనం ప్యాలెస్ ఆఫ్ కల్చర్ అండ్ సైన్స్ భవనం. ఆ భవనం నుంచి సల్మాన్ బంగీజంప్ చేసే సీను షూట్ చేశారు. మొదట చిత్రయూనిట్ సల్మాన్ ఖాన్ చేస్తున్న ఫీట్ ను ఎంత మాత్రం అంగీకరించలేదు. సల్మాన్ ఖాన్ కు కచ్ఛితంగా డూప్ అవసరం అని స్టంట్ మాస్టర్స్ చెప్పినా ఈ కండల వీరుడు వినిపించుకోలేదు. స్టంట్ మాస్టర్స్ వద్ద ట్రైనింగ్ తీసుకొని మరీ తనే సొంతంగా భంగీ జంప్ చేశాడు. ఈ వయస్సులోనూ సల్మాన్ ఖాన్ ఈ విధమైన ఫీట్స్ చేయటంతో బిటౌన్ షాక్ అయ్యింది.
 
Top