modi pawan chandrababu
నిన్న పవన్ కళ్యాణ్ రాజకీయ ఉపన్యాసాల నేపధ్యంలో పవన్ మోడీ చంద్రబాబుల కలయికతో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కలలు కంటున్న మేజిక్ ఫిగర్ 111 ను పవన్ ఇటు తెలంగాణలో కాని లేకుంటే అటు కోస్తా ఆంధ్రప్రదేశ్ లోకాని వాస్తవ రూపంలోకి తీసుకు వస్తాడా అనే ఆ శక్తికర చర్చ మీడియాలో జరుగుతోంది. లెక్కల్లో ఒకటి, ఒకటి, ఒకటి కలిస్తే మూడవుతుందని, కానీ ఇక్కడ మాత్రం 111 అవుతుందని మోడీ పవన్ చంద్రబాబులను ఉద్దేశించి అనడం ఈ ఆశక్తికర చర్చకు తావు యిచ్చింది  అయితే మోడీ అంచనాలు ఇలా ఉంటే వాస్తవాలు వేరేలా కనిపిస్తున్నాయి. నిన్న తెలంగాణలో పవన్‌కళ్యాణ్ స్పీచ్ అంతా బీజేపీపైనే సాగింది. మోదీ ప్రధాని కావాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూనే, సమస్యలకు సరైన సమాధానం ఆయనే చెప్పగలరంటూ పవన్ తన గళం వినిపించాడు. కానీ పవన్ టీడీపీ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడంతో తెలుగుతమ్ముళ్లు షాక్ అయ్యారు.  నిజామాబాద్, హైదరాబాద్ సభల్లో పవన్‌కళ్యాణ్ మాట్లాడిన మాటలను నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఎల్బీస్టేడియంలోని ఎన్డీఏ బహిరంగసభ వేదికపై నరేంద్రమోదీని కలిసిన పవన్‌కళ్యాణ్, పక్కనేవున్న చంద్రబాబుని పట్టించుకోలేదు.ఆ సన్నివేశాన్ని చూసిన తెలుగుతమ్ముళ్లు అనేకవిధాలుగా చర్చించుకుంటున్నారు. రాష్ర్టంలో కీలకమైన నేత, ఓ పార్టీకి అధ్యక్షుడిగావున్న చంద్రబాబుని కనీసం స్టేజ్ మీద పవన్ పలకరించకపోవడంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. నరేంద్రమోదీ మాట్లాడుతున్నంత సేపూ జనం నుంచి స్పందన వస్తున్నా ఇటు పవన్‌కళ్యాణ్ కాని అటు చంద్రబాబు కాని ఒకరికొకరు ఏమీ మాట్లాడుకోకుండా అందరికీ షాక్ ఇచ్చారు. ఈ నేపధ్యంలో నిన్న హైదరాబాద్ లో జరిగిన మోడీ సభ సాక్షిగా పవన్ చంద్ర బాబుల మధ్య విభేదాలు మరోసారిబయటకు వచ్చిన నేపధ్యంలో మోడీ కోరుకుంటున్న మేజిక్ ఫిగర్ 111 సాధ్యమేనా ? అని అనిపిస్తోంది... 
 
Top