‘పెటా' సంస్థ గురించి కొత్తగా పరిచయం చేయవలసిన అవసంరం లేదు. జంతుల హక్కుల కోసం పోరాడే ఈ అంతర్జాతీయ సంస్థకు చాలా మంది సెలబ్రిటీలు తమదైన రీతిలో ప్రచారం చేస్తుంటారు. జంతువులను హింసించ కూడదని, వాటిని చంపి తినకూడదని, మనషి స్వార్థం కోసం వాటిని వాడు కోకూడదని వాటికి కూడా జీవించే హక్కు ఉందనీ ప్రచారంచేసే ఈ సంస్థ ప్రజలను శాఖా హారులుగా మారండి అంటు జనం ముందుకు తమ సంస్థ ఆశయాలను ప్రచారం చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ‘పెటా' కోసం తన అందాలను ఆరబోసి బాలీవుడ్ బ్యూటీ రీచా చద్దా చేస్తున్న ఈ వెరైటీ విన్యాసాలు సంచలనంగా మారాయి. ఈ సంస్థ ఆశయాల ప్రచారం కోసం రిచా ఇలా ఒంటిపై ఆకులు మాత్రమే పెట్టుకుని న్యూడ్ ఫోటో షూట్ ఇవ్వడం సంచలనంగా మారింది. మనిషి ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే శాఖాహారం తినడమే మేలని, మాంసాహారం తినేవారికంటే శాఖాహారం తినే వారు కనీసం 10 సంవత్సరాల ఎక్కువ జీవిస్తారని రీచా చద్దా ప్రచారం చేస్తోంది. అమృత్ సర్‌లో పుట్టి, ఢిల్లీలో పెరిగిన రీచా చద్దా మోడలింగు వైపు ఆకర్షితురాలై ఆ తరువాత సినిమాలలో నటించినా పెద్దగా కలిసిరాలేదు. ఇక లాభం లేదనుకుని అవకాశాలు కోసం ఇలా కొత్త అవతారం ఎత్తింది అనుకోవాలి.. 
 
Top