ప్రకాష్ రాజ్ ‘ఆగడు’ సినీమా యూనిట్ మధ్య జరిగిన వివాదం ఇప్పుడు తుఫాన్ గా
మారి టాలీవుడ్ లో సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ వివాదం ఒక కుటుంబ వివాదంలా
సమసి పోతుందని అందరు అనుకున్నారు. కానీ ఈ విషయాన్ని టాలీవుడ్ డైరెక్టర్స్
అసోసియేషన్ చాల సీరియస్ గా తీసుకోవడమే కాకుండా ఈ విషయం పై సభ్యుల
అభిప్రాయలను సేకరించడమే కాకుండా ప్రకాష్ రాజ్ కు 75 లక్షల ఫైన్ ను
విధించడమే కాకుండా ఆ మొత్తాన్ని వసూలు చేసే బాధ్యత టాలీవుడ్ దర్శకుల సంఘం
తీసుకుందనే వార్తలు వస్తున్నాయి.
ఈ విషయంలో ప్రకాష్ రాజ్ సహకరించకపోతే అతని పై బ్యాన్ విధించే ఆలోచన కూడ
టాలీవుడ్ దర్శకుల సంఘం అదేవిధంగా నిర్మాతల మండలి చేస్తోందని ఎపిహెరాల్డ్ కు
అందుతున్న విశ్వసనీయ సంచారం. ప్రతిరోజు ‘ఆగడు’ సినిమా షూటింగ్ కు ఆలస్యంగా
రావడమే కాకుండా ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్స్ పై అవమానకరంగా ప్రకాష్
రాజ్ మాట్లాడిన విషయాన్ని డైరెక్టర్స్ అసోసియేషన్ చాల సీరియస్ గా తీసుకుని ఈ
చర్యలకు శ్రీకారం చుట్టింది అని అంటున్నారు.
విషయం చేయి జారిపోతున్న సందర్భాన్ని గుర్తించిన ప్రకాష్ రాజ్ తనకు
సన్నిహితుడైన దిల్ రాజ్ ద్వారా రాజీ చర్చలు ప్రారంభించాడని టాలీవుడ్
న్యూస్. అయితే ఇంత వివాదం జరుగుతున్నా ఈ సినిమా హీరో ప్రిన్స్ మహేష్
ఇరువైపులా ఎటువంటి విషయం మాట్లాడకుండా వ్యూహాత్మక మౌనం పాటించడం అందర్నీ
ఆశ్చర్య పరుస్తోంది.