కొద్దిరోజుల క్రితం రాహుల్ పై సెటైర్లు వేసిన స్వాతి లేటెస్ట్ గా మీడియాతో మాట్లాడిన మాటలు మీడియాకే ఖంగు తినిపించాయి. ఏ హీరోయిన్‌ అయినా ముందు తన మాతృభాషలో తర్వాత మరి ఏ ఇతర భాషలలోనైనా వెలుగొందాలని కలలు కంటూ ఉంటారు. అయితే కలర్స్ స్వాతి హాలీవుడ్‌ సినిమా రంగం పై చేసిన విచిత్ర కామెంట్ టాక్ ఆఫ్ మీడియాగా మారింది.  హిందీ చిత్రాల వరకు తాను ఓకే కాని హాలీవుడ్‌లో మాత్రం సినిమాలు చెయ్యనని చెప్పడం అందర్నీ ఆశ్చర్యం కలిగిచింది. కార్తికేయ సినిమా ఫినిషింగ్‌ వర్క్‌లో పాల్గొన్న స్వాతిని కలిసిన సినిమా విలేకర్లు ఈ మాటలు విని షాక్ అయ్యారు. ఈ విషయం పై వివరాలు అడిగితే హాలీవుడ్‌ సినిమాల్లో స్త్రీ పాత్రలు మరీ సెక్సీగా చూపిస్తారని.. ఇక ముద్దులయితే కంపల్సరీ అని అంటు కాస్ట్యూమ్స్‌ మరీ దారుణం అంటు విచిత్రంగా మాట్లాడటమే కాకుండా అందుకే తాను హాలీవుడ్‌ సనిమాలలో నటించనని చెబుతున్న స్వాతి మాటలు విని హాలీవుడ్‌లో ఛాన్స్‌ అంటే.. ఏ కంగనా రనౌత్‌, కరీనాకపూర్‌, సోనాక్షి, దీపికా పడుకొనే లాంటి వాళ్ళకొస్తుందిగానీ స్వాతికి హాలీవుడ్ ఛాన్స్ ఏమిటి అంటు అర్ధం కాక జుట్టు పీక్కున్నారట మీడియా వారు. 
 
Top