సినిమాలలో ప్రయోగాలు చేయాలి అంటే ఆ లిస్టులో ముందు వరసలో ఉంటాడు కమల్ హసన్.
భారతీయ సినిమా రంగంలో అయన చేసినన్ని ప్రయోగాలు మరే హీరో చేయలేదు అంటే
అతిశయోక్తి కాదు. మరగుజ్జుగా, ముసలివాడిగా, ఒకే సినిమాలో పది పాత్రలు
పోషించ గల ధైర్యం ఒక్క కమల్ కే సొంతం.
తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో బిజీగా నటిస్తూ తన అందంతో టాలీవుడ్,
బాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల మతి పొగడుతున్న శృతిహాసన్ ఇపుడు తండ్రికి
తగ్గ కూతురు అనిపించుకోవాలని ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏ హీరోయిన్ ఇంత
చిన్న వయసులో చేయనటువంటి సాహసం చేయడానికి శృతి రెడీ అవుతోంది.
బాలీవుడ్ డైరెక్టర్ తిగ్మంషు దులియా దర్శకత్వంలో తెరకెక్కుతు న్న "యారా"
అనే హిందీ సినిమాలో శృతి హాసన్ వృద్దురాలి పాత్రలో నటించడానికి
అంగీకరించింది. తుపాకీ సినిమా విలన్ గా నటించిన విద్యుత్ జమాల్, అమిత్ సాద్
హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా కధ రెండు తరాలకు చెందినది. ఈ సినిమాలో
హీరోయిన్ గా శృతి హాసన్ నటి స్తోంది.
ఈ సినిమాలో వచ్చేఫ్లాష్ బ్యాక్ కు సంభందించి వచ్చే వృద్ధురాలి పాత్ర కోసం
ఎవరైనా సీనియర్ నటిని తీసుకుందామని ఈ సినిమా దర్శకుడు ఆలోచిస్తున్న
నేపధ్యంలో ఆ ముసలమ్మ పాత్ర కుడా తనే చేస్తాను అని శృతి అనడటం ఆ సినిమా
యూనిట్ కే కాకుండా బాలీవుడ్ కు ఫ్లాష్ న్యూస్ గా మారింది.