ఆర్.ఎక్స్.100 తో కార్తికేయకు ఎంత పాపులారిటీ వచ్చిందో అది మొత్తం హిప్పీ తో ఊడ్చుకుపోయింది. ఒక్కసారిగా ఈ సినిమాతో కార్తికేయ నేల కరుచుకున్నాడు. అసిస్టెంట్ గా పనిచేసిన వారంతా డైరక్టర్లు కాలేరు. మెగా ఫోన్ పట్టుకున్నవారంతా సీన్లు పండించలేరు. అన్న విషయం హిప్పీ సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి అర్థమవుతుంది. ఇప్పుడు గుణ369 సినిమా టీజర్ చూస్తే కూడా ఇదే అనిపిస్తుంది. కొత్త డైరక్టర్ అర్జున్ జంధ్యాల డెబ్యూ సినిమా ఇది. అజయ్ భూపతి డెబ్యూ సినిమా ఆర్ ఎక్స్ 100 చూస్తే విషయం వుంది డైరక్టర్ దగ్గర అనిపిస్తుంది. గుణ 369 చూస్తే వుందా? అన్న అనుమానం వస్తోంది.

టీజర్ అంత ఇమెచ్యూర్ గా వుంది. టీజర్ లో డైరక్టర్ పేరు మినహా ఎక్కడా కొత్తదనం అన్నది కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. టీజర్ లో తొంగిచూసిన కథ లైన్ లో కూడా అట్టే కొత్తదనం లేదని క్లారిటీ వచ్చేస్తుంది. మంచి హిట్ తరువాత కార్తికేయ చేసిన హిప్పీ మిజరబుల్ ఫెయిల్యూర్. సినిమా సబ్జెక్ట్ నే సమస్య అని అర్థం అయిపోయింది. మరి ఆ తరువాత వస్తున్న సినిమా కూడా ఇలాగే వుందీ అంటే, కార్తికేయ ఎంచుకుంటున్న తీరుపై అనుమానం కలుగుతుంది. 

అసలు కార్తికేయకు కథల ఎంపిక వచ్చా..రాదా అన్న సందేహం వస్తోంది. అంతేకాదు చొక్కా విప్పేస్తే సరిపోదని, సరైన వెర్సటాలిటీ, నటన ప్రదర్శించాల్సి వుంటుందని కార్తికేయ తెలుసుకోక పోతే ఇంటిదారి పట్టాల్సిందే. కాంపిటీటీవ్ వరల్డ్ లో నిల్చోవాలంటేనే కష్టపడాలి. ముందుకెళ్లాలి అంటే ఇంకా కష్టపడాలి. కానీ కార్తికేయ కేవలం తన జిమ్ బాడీని నమ్ముకుని ఆగిపోతున్నట్లు కనిపిస్తోంది. జిమ్ బాడీ టాలీవుడ్‌లో అందరికీ ఉంది. కానీ కావల్సింది అది కాదుకదా...కార్తికేయ. 
 
Top