సౌత్ లో ఎన్ని సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలన్నదే తమన్నా డ్రీమ్. కానీ కనీసం అక్కడ ఓ మోస్తారు హిట్ ని కూడా తన ఖాతాలో వేసుకోలేకపోతోంది. అందుకే హిందీ నుంచి ఏ చిన్న అవకాశం వచ్చినా మిస్ అవ్వదు. అవసరమైతే ఓ తమిళ్, తెలుగు సినిమానైనా పక్కనపెట్టి మరీ బాలీవుడ్ సినిమాకు కాల్షీట్లు ఇచ్చేస్తుంది. కానీ మిల్కీ బ్యూటీ ఎంత ప్రయత్నించినా హిందీలో మాత్రం క్లిక్ అవ్వలేకపోతోంది. ఇదే విషయం మరోసారీ ప్రూవ్ అయింది.

దాదాపు మూడేళ్ల తర్వాత హిందీలో ఓ సినిమా చేసింది తమన్న. ప్రభుదేవాతో కలిసి ఆమె నటించిన 'ఖామోషీ' సినిమా గతవారం విడుదలైంది. హిందీ జనాలకు ఈ సినిమాపై ఎలాంటి అంచనాల్లేకపోయినా, తమన్న మాత్రం భారీ అంచనాలు పెట్టుకొని హిట్ కొడతాననుకుంది. కానీ విడుదలైన 3 రోజులుకే ఈ సినిమాను ఎత్తేశారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు మొదటిరోజే డిజాస్టర్ టాక్ వచ్చేసింది. కానీ వీకెండ్ లో ఏమైనా పికప్ తీసుకోవచ్చేమోనని వెయిట్ చేశారు. అయితే శని, ఆదివారాలు కూడా ఖామోషీ సినిమా డల్ గానే ఉంది. 

దీనికితోడు ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ ప్రభావం గట్టిగా పడింది. అలా విడుదలైన 3 రోజులకే తమన్న సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. బాలీవుడ్ లో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా తమన్నాకు కలిసిరావడం లేదు. 2013లో అజయ్ దేవగన్ తో చేసిన హిమ్మత్ వాలా సినిమా నుంచి ఆమెను బాలీవుడ్ లో ఫ్లాపులు  నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. మధ్యలో వచ్చిన "ఎంటర్ టైన్ మెంట్" అనే సినిమా ఓ మోస్తరుగా ఆడినప్పటికీ తమన్న బాలీవుడ్ కెరీర్ కు అది ఏమాత్రం కలిసిరాలేదు. దాంతో  నేనెందుకు మీకు నచ్చడం లేదో అర్థం కావడం లేదని బాధపడుతుందట తమన్న.
 
Top