టాలీవుడ్ చందమామ కాజల్ ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసింది దర్శకుడు తేజ. లక్ష్మి కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. పరిశ్రమకు వచ్చి పదేళ్లు పైన అవుతున్నా సరే ఇప్పటికి అమ్మడికి అవకాశాలు బాగానే వస్తున్నాయి.
రెండు మూడేళ్ల క్రితం కాజల్ కెరియర్ కాస్త అటు ఇటుగా అనిపించినా ఇప్పుడు మళ్లీ సెట్ రైట్ అయ్యింది. ఖైది నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు కాజల్ కెరియర్ కు చాలా ప్లస్ అయ్యాయి. తేజ డైరక్షన్ లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా దర్శకుడిగా ఆయనకు మంచి హిట్ ఇచ్చింది.
అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమా సీత. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఈ సినిమా తర్వాత తేజ మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆ సినిమాలో కూడా కాజల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. కాజల్ తో ఇప్పటికే డెబ్యూ మూవీతో కలిపి మూడు సినిమాలు చేసిన తేజ ఇప్పుడు మరో సినిమా చేస్తుండటం అందరికి షాక్ ఇస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ సినిమాకు కాజల్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుందని తెలుస్తుంది.
డైరక్టర్ తేజాకి కాజల్ లో అంతగా ఏం నచ్చిందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా కమర్షియల్ సినిమాలు చేస్తూ కాజల్ ఈమధ్య కొత్త ప్రయత్నాలు చేస్తుంది. కోలీవుడ్ లో నయనతారలా తెలుగులో ఇప్పటికే సమంత వెరైటీ సినిమాలు చేస్తుండగా కాజల్ కూడా అదే పంథా కొనసాగించేలా కనిపిస్తుంది.