శ్రద్దా కపూర్ బాలీవుడ్ లో వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది. ఇప్పటికే అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రద్ధ మరికొన్ని సినిమాలు చేయడానికి సిద్ధం అయ్యింది. మొదటిసారి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రభాస్ సాహో సినిమాతో అడుగుపెట్టబోతున్నది.
ఇప్పటికే సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 15 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది. ఇందులో శ్రద్ధ కపూర్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. తొలిసారి నేను పోలీసు పాత్రలో నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. దేశం కోసం భద్రతా బలగాలు ఎన్నో త్యాగాలు చేస్తాయి. అలాంటిది నేను వారి పాత్రలో నటిస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను.
నాకు వైద్యురాలిగా, పోలీసుగా విభిన్న పాత్రల్లో నటించాలన్న ఆసక్తి ఉంది. కానీ ఎన్ని పాత్రల్లో నటించినా పోలీసు పాత్ర చాలా స్పెషల్. షూటింగ్ చేస్తున్నంతసేపు నేను గన్ను పట్టుకునే ఉన్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే గన్ను నా శరీరంలో అవయవంలా మారిపోయింది.
సెట్‌లో ఉన్నప్పుడు నా చేతిలో గన్ను లేకపోతే దాని కోసం ఆరా తీసేదాన్ని. ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో గన్ను వాడాలన్న విషయంలో ఓ పోలీసు మైండ్ చాలా షార్ప్‌గా ఉంటుంది. ఆ విషయాలు కూడా నేను తెలుసుకోవాలి అని చెప్పింది శ్రద్దా కపూర్. దాదాపు 300 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా బిజినెస్ పరంగా అదే రేంజ్ లో ఉండటం విశేషం.