నాగచైతన్య మజిలీ సినిమాతో మళ్ళీ లైన్లోకి వచ్చాడు.  ప్రస్తుతం ఈ హీరో మామ వెంకటేష్ తో కలిసి వెంకిమామ సినిమా చేస్తున్నాడు.  కాశ్మీర్ లో షూటింగ్ జరుగుతున్నది.  చైతు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబుతోన్నాడు.  చైతూకి జోడిగా ఈ సినిమాలో రాశిఖన్నా నటిస్తోంది.  

ఈ సినిమా తరువాత బంగార్రాజు, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.  ఒకదాని తరువాత మరొకటిగా సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటితో వీటితో పాటు నాగచైతన్య దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేయాల్సి ఉన్నది.  దీనికి శేఖర్ కమ్ముల దర్శకుడు.  

శేఖర్ ఫిదా హీరోయిన్ సాయి పల్లవిని నాగచైతన్య సినిమా కోసం తీసుకున్నారట.  చైతు.. సాయి పల్లవిది న్యూ కాంబినేషన్.  ఎలా ఉంటుందో చూడాలి.  శేఖర్ కమ్ముల సినిమా అంటే ఎలా ఉంటుందో తెలుసు.  ఫిదా తరువాత శేఖర్ సినిమా చేయలేదు.  

ఫిదా తరువాత సాయి పల్లవికి కూడా ఆ రేంజ్ హిట్ దొరకలేదు.  వెంకిమామ హిట్టయితే..చైతు తిరిగి లైన్లోకి వచ్చినట్టే అవుతుంది.  మరి ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది.. అనే విషయాలు తెలియాలంటే దిల్ రాజు ప్రకటించే వరకు ఆగాల్సిందే.  
 
Top