బుల్లితెర యాంకర్ అనసూయ క్రేజీ ఫాలోవర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉదయభాను తర్వాత యాంకర్స్ లో హాట్ ఇమేజ్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయింది అనసూయ మాత్రమే. బుల్లితెర మీద యాంకర్ గా చెలరేగిపోతున్న అనసూయ సినిమాల్లో కూడా దుమ్ముదులిపేస్తుంది. క్షణం సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు రంగస్థలం రంగమ్మత్త పాత్రలో అదరగొట్టింది.

ఓ పక్క సినిమాలు చేస్తున్నా మరో పక్క జబర్దస్త్ షోని మాత్రం వదలదు అనసూయ. అసలకే ఒకసారి కొద్దిగా బ్రేక్ ఇచ్చే సరికి రష్మి తనకు పోటీగా మారింది. తన స్థానానికే ఎసరు పెట్టినంత పని చేసింది. ఇదిలాఉంటే ఇప్పుడు అనసూయకు సినిమా అవకాశాలు బాగా వస్తున్నాయి. అందుకే ఇక పూర్తిస్థాయిలో సినిమాల మీద ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.

అందుకే జబర్దస్త్ కు త్వరలో గుడ్ బై చెబుతుందట. సినిమాల డేట్స్ వల్ల జబర్దస్త్ షో యాంకరింగ్ చేయడం కుదరట్లేదట. తన ఒక్కదాని డేట్స్ వల్ల మిగతా వాళ్లను ఇబ్బంది పెట్టలేరు. అంతేకాదు వైసిపి ఎమ్మెల్యేగా ఉన్న రోజాకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు షూటింగ్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. 

కాబట్టి తనకు ఇంత క్రేజ్ వచ్చేందుకు సహకరించిన జబర్దస్త్ ను జీవితంలో మర్చిపోలేనని చెబుతున్న అనసూయ ఆ షో కొనసాగించడం కష్టమని భావిస్తుందట. అయితే అనసూయ జబర్దస్త్ వదిలేస్తే ఆ స్థానంలో రష్మిని కొనసాగిస్తారా లేక మరెవరినైనా తెస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా జబర్దస్త్ లో అనసూయ లేకుంటే షోకి కలరింగ్ తక్కువైనట్టే అనిపిస్తుంది.
 
Top