కియారా అద్వానీ భరత్ అనే నేను ఒక్క సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికి పరిచయం అయ్యింది.  రెండో సినిమా రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసినా ఉపయోగం లేకుండా పోయింది.  మరోవైపు బాలీవుడ్ లో టాప్ స్థాయిలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నది.  

ఈ స్థాయిలో అవకాశాలు దక్కించుకుంటున్న ఈ హీరోయిన్ మొదట్లో సినిమా అవకాశాల కోసం ఎంతగా కష్టపడిందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు.  హీరోయిన్ గా చేసిన మొదటి సినిమా ‘ఫగ్లీ’. 2014లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది.  ఈ సినిమా ఫ్లాప్ తర్వాత హీరోయిన్‌గా తనకు అవకాశాలు రాలేదని చెప్పుకొచ్చింది. కెరీర్‌లో గ్యాప్ రావడం వల్ల తనకు మంచే జరిగిందని చెప్పింది.  అదెలాగో చూద్దాం. 

2014 తరువాత కియారా అనేకమంది దర్శకులను, నిర్మాతలను కలిసింది.  ఇస్తామని చెప్పి చాలామంది అవకాశం ఇవ్వలేదట.  చివరకు నీరవ్ పాండే దర్శకత్వంలో ఎంఎస్ ధోని బయోపిక్ సినిమాలో అవకాశం దొరికింది.  ఆ అవకాశాన్ని ఈ హీరోయిన్ సద్వినియోగం చేసుకుంది.  

ఈ సినిమా విజయం తరువాత చేసిన మెషిన్ పెద్దగా హిట్ కాలేదు.  కానీ, అందులోని చీజ్ బడి సాంగ్ హిట్ కావడంతో టాలీవుడ్ నుంచి మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా అవకాశం వచ్చింది.  ఇదే సమయంలో నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మించిన లస్ట్ స్టోరీస్ లోని పాత్రకు మంచి పేరు వచ్చింది.  ప్రస్తుతం కబీర్ సింగ్, లక్ష్మి బాంబ్, గుడ్ న్యూస్, షేర్ షా సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యింది ఈ బ్యూటీ.
 
Top