టాలీవుడ్ లో కొన్ని సూపర్ హిట్ కాంబినేషన్స్ ఉంటాయి.  అల్లు అర్జున్, త్రివిక్రమ్  పవన్ కళ్యాన్, త్రివిక్రమ్  మహేష్ బాబు  త్రివిక్రమ్  హీరోలు ఎవరైనా ఈ దర్శకుడి దర్శకత్వంలో నటిస్తే అది సూపర్ హిట్ సినిమా కావాల్సిందే.  గతంలో అతడు సినిమాతో మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ తర్వాత ఖలేజా తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించారు.  

ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరోసినిమా రాబోతుందని అంటున్నారే కానీ అది రియాల్టీలో జరగలేదు.  కాగా, త్రివిక్రమ్ పవన్, ఎన్టీఆర్ లతో సినిమాలు కానిచ్చేశారు.  ప్రస్తుతం అల్లు అర్జున్ తో ముచ్చటగా మూడో సారి సినిమా తీయబోతున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది.  ఇప్పటికే స్క్రిప్ట్ ఒకే చేసుకున్న త్రివిక్రమ్ షూటింగ్ ముహూర్తం కూడా పెట్టుకున్నారు.

టాలీవుడ్ లో వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. మరో వైపు  పరశురామ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న మహేష్ త్రివిక్రమ్ ని కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఒక కమర్షియల్ యాడ్ ద్వారా ఈ ఇద్దరు ఒకటయ్యారు. ఇటవల మహేష్ తో ఒక చిన్న లైన్ గురించి త్రివిక్రమ్ చర్చించినట్లు సమాచారం. త్వరలో ఈ కాంబోపై అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు టాక్. 
 
Top