కన్నడ పరిశ్రమలో ఇప్పుడు అందరి నోటా కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ పేరు మారుమోగుతుంది. ఐదేళ్ల కెరియర్ లో ఉగ్రం, కె.జి.ఎఫ్ రెండే రెండు సినిమాలు చేశాడు ప్రశాంత్ నీల్. ఉగ్రం సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక కె.జి.ఎఫ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కె.జి.ఎఫ్ కన్నడ సినిమా పరిశ్రమలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది.

ప్రస్తుతం కె.జి.ఎఫ్ చాప్టర్ 2 సెట్స్ మీద ఉంది. ఈ సినిమా కూడా అంచనాలను అందుకునేలా తెరకెక్కిస్తున్నారు. ఈ సెకండ్ పార్ట్ 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ పార్ట్ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, రవీనా టాండన్ కూడా ఉంటారని అంటున్నారు. ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఓ తెలుగు సినిమా ప్లాన్ చేస్తున్నాడట.

తెలుగులో బడా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు నిర్మాణంలో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే సినిమాకు సంబందించిన లైన్ ఓకే అయ్యిందట. ఇక ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తాడని అంటున్న్నారు. ప్రస్తుతం సాహో సినిమా ప్రభాస్ ఆ తర్వాత రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు.

సాహో ఎలాగు ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుందని టాక్. యశ్ లాంటి యువ హీరోనే కె.జి.ఎఫ్ లో అంత పవర్ ఫుల్ గా చూపించాడు అంటే ఇక బాహుబలి ప్రభాస్ ను ప్రశాంత్ ఇంకెలా పవర్ ఫుల్ గా చూపిస్తాడో అని ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఆ సినిమా హిట్టైతే మాత్రం ప్రశాంత్ కూడా పాన్ ఇండియా డైరక్టర్ అయినట్టే. 
 
Top