నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. లెజెండ్ సినిమా నుండి ఎన్.టి.ఆర్ బయోపిక్ వరకు మోక్షజ్ఞ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఎన్.టి.ఆర్ బయోపిక్ సక్సెస్ అయితే క్రిష్ డైరక్షన్ లోనే మోక్షజ్ఞ సినిమా ప్లాన్ చేయాలని చూశాడు బాలకృష్ణ.

అయితే ఎన్.టి.ఆర్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు అందుకే సైలెంట్ అయ్యాడు. కొన్నాళ్లుగా మీడియా కంటికి కనిపించకుండా మోక్షజ్ఞ యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడని.. డ్యాన్స్, ఫైట్స్ అన్నిటిలో ప్రావీణ్యం సాధిస్తున్నాడని అన్నారు. ఇదవరకు కాస్త బొద్దుగా అనిపించే మోక్షజ్ఞ స్లిమ్ లుక్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

లేటెస్ట్ గా మోక్షజ్ఞ లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఎన్నికల్లో విజయాన్ని ఆకాంక్షిస్తూ పూజలు చేయించాడు బాలయ్య. ఆ టైంలో మోక్షజ్ఞ కూడా పాల్గొన్నాడు. అయితే మోక్షజ్ఞ లుక్స్ లో ఏమాత్రం తేడా కనిపించడం లేదు. ఈ పిక్స్ చూసి నందమూరి ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. నటన, డ్యాన్స్, ఫైట్స్ అన్నిటిని నేర్చుకుని ఇక ఫైనల్ గా లుక్ విషయంలో దృష్టి పెడతాడేమో అంటున్నారు.

మోక్షజ్ఞ మేకోవర్ పై ఇప్పుడు అంతటా హాట్ న్యూస్ గా మారింది. హీరోగా మోక్షజ్ఞ ఎలా ఉంటాడన్న ఎక్సైట్ మెంట్ ఏర్పడింది. మరి ఇప్పటికి సీక్రెట్ గా ఉంచుతున్నా సినిమా టైం కల్లా మోక్షజ్ఞ ఫ్యాన్స్ మనసులు గెలిచేలా ఉంటాడని ఆశిస్తున్నారు. మరి అది ఎప్పుడు జరుగుతుంది ఏంటన్నది చూడాలి.
 
Top