కియారా అద్వానీ తెలుగులో మహేష్ సరసన నటించి ఒక్కసారిగా టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లి పోయింది. దీనితో కియారాకు అభిమానులు ఓ రేంజ్ లో ఏర్పాడ్డారు.  గ్లామర్.. నటన.. హాట్నెస్ మాత్రమే కాదు.. బోల్డ్ యాక్టింగ్.. స్టైల్ ఇవన్నీ టన్నులలో ఉంటాయి ఈ ముంబై భామకు. ఆఖరికి డ్యాన్స్ కూడా కిరాకు. ఇవన్నీ ఒక ఎత్తైతే కియారా బయట ఎప్పుడైనా కన్పించిందంటే చాలు ముంబైలో ఉండే ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించకుండా ఉండలేరు. 

ఎంత క్యాజువల్ గా ఉన్నా ఆ స్టైలే వేరు.  తాజాగా కియారా అద్వాని అలాంటి డ్రెస్ లోనే కనిపించింది.. ఆలివ్ గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ టీ-షర్ట్..  మిలిటరీ స్టైల్ లూజ్ ప్యాంట్ తో.. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ ధరించి భలే నవ్వు నవ్వింది.  లూజ్ హెయిర్.. ఫేస్ కు మేకప్ అసలే లేదు.. ఒకవేళ ఉన్నా చాలా మినిమం. ఆ స్కిన్ టోన్.. నిగనిగలాడుతున్న పరువాలు చూస్తే.. ఒకరికి వేయాల్సిన ఓటు మరొకరికి వేసేలా తికమక పడడం ఖాయం.

మరి ఇలాంటి బ్యూటీకి క్రేజీ ప్రాజెక్టులు లైన్లో ఉండకుండా ఎలా ఉంటాయి?  'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్' లో అమాయకంగా ఉంటూనే డజన్ల కొద్ది లిప్పులాకులను హీరోకు అవలలీలగా ఇచ్చే ప్రీతీ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా 'గుడ్ న్యూస్' అనే మరో క్రేజీ బాలీవుడ్ ఫిలిం లో కూడా నటిస్తోంది. దీనితో కియారా ఇప్పుడు అందరికి హాట్ ఫేవరేట్ అయిపొయింది. 
 
Top