తెలుగులో అర్జున్ రెడ్డికి ఎంతటి క్రేజ్ ఉన్నదో చెప్పక్కర్లేదు.  విజయ్ ల్యాండ్ మార్క్ పెరఫార్మన్స్ ఇచ్చాడు. సినిమా సూపర్ హిట్ కొట్టింది.  ఈ స్థాయిలో సినిమా హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.  ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా చేస్తున్నారు.  కబీర్ సింగ్ గా షాహిద్ కపూర్ చేస్తున్నాడు.  ఎంత చేసినా ఒరిజినల్ కి తగ్గట్టుగా సినిమా రాదు.  

అంతెందుకు ఇపుడు విజయ్ దేవరకొండను మళ్ళీ ఈ సినిమా చేయమంటే చేయగలడా కష్టమే.  అయితే, ఇదే సినిమాను కోలీవుడ్ లో ఆదిత్య వర్మగా తీస్తున్నారు.  మొదట ఈ సినిమాకు బాల ను దర్శకుడిగా తీసుకున్నారు.  బాలకు రీమేక్ టచ్ లేదు.  ఆయన సినిమాలు వేరు.  

పాపం బాల తీసిన సినిమా బాగాలేకపోవడంతో దాన్ని చెత్తబుట్టలో పడేసి.. సందీప్ రెడ్డి వంగ శిష్యుడు గిరిసయ్య ను డైరెక్టర్ గా తీసుకొని రెండోసారి సినిమా షూట్ చేశారు. మక్కికి మక్కిగా మూవీ వచ్చింది.  ఆదిత్య వర్మగా విక్రమ్ కొడుకు ధృవ్ నటిస్తున్నాడు.  ధృవ్ ను పరిచయం చేస్తున్న సినిమా కాబట్టి హిట్ కోసం విక్రమ్ తపించిపోతున్నాడు.  

గిరిసయ్య దర్శకత్వం పర్వాలేదనిపించింది.  అర్జున్ రెడ్డి సినిమాను పక్కన పెట్టి చూస్తే ఎబ్బే అంత పెద్దగా ఏమిలేదు అనిపిస్తుంది.  ఏమున్నది ఏమి లేదు అన్నది పక్కన పెడితే సినిమా ఎలా ఉండబోతుంది అన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.  
 
Top