బుల్లితెర మీద యాంకర్ రవి హంగమా అందరికి తెలిసిందే.. యువతరం ఆలోచనలకు అద్దం పడుతూ బుల్లితెర మీద షోలు చేస్తుంటారు. అయితే అవి చేస్తున్న యాంకర్లు కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకోవడం కామనే. అలాంటి వారిలో యాంకర్ రవి కూడా ఒకరు. సంథింగ్ సంథింగ్ అంటూ మాటివిలో లాస్యతో కలిసి అల్లరి చేసిన రవి ఈటివిలో పటాస్ తో అదరగొడుతున్నాడు.
పటాస్ లో శ్రీముఖితో క్లోజ్ గా మూవ్ అవుతున్న రవి లాస్యతో ఎలాంటి రూమర్స్ ఫేస్ చేశాడో శ్రీముఖితో కూడా అలాంటి రూమర్స్ ఎదుర్కున్నాడు. తన పర్సనల్ లైఫ్ గురించి ఇప్పటిదాకా ఎక్కడ రివీల్ అవని రవి సడెన్ గా ఏమైందో ఏమో కాని ఫేస్ బుక్ లో రవి తన భార్య నిత్యా సక్సేనా, తన కూతురు వియాతో దర్శనమిచ్చాడు.
తనకు పెళ్లైందన్న విషయాన్ని ఇన్నాళ్లు దాచిపెట్టిన రవి ఫైనల్ గా భార్యా పిల్లలను పరిచయం చేశాడు. లాస్యకు పెళ్లైన టైంలోనే తన మీద వచ్చిన రూమర్స్ కు సమాధానంగా భార్యా పిల్లలను పరిచయం చెయొచ్చు కాని రవి అలా చేయలేదు. ఇక ఇప్పుడు సడెన్ గా ఏమైందో ఏమో రవి తన భార్యా కూతురుతో దిగిన పిక్స్ షేర్ చేశాడు.
రవి ఈ పిక్స్ పెట్టడం వల్ల చాలా ప్రశ్నలకు సమాధానం దొరికిందని తెలుస్తుంది. ఇక బుల్లితెరలో బ్యాచిలర్ గా పాపులారిటీ అయిన సుధీర్ పెళ్లి ముహుర్తం బయట పడాల్సి ఉంది. సుధీర్ విషయంలో కూడా ఇలాంటి ట్విస్ట్ ఏదైనా ఉంటే బాగుండేది. అప్పట్లో సుధీర్ కు ఆల్రెడీ పెళ్లైందని కొన్ని ఫోటోలు మీడియాలో హల్ చల్ చేశాయి. మరి సుధీర్ ఇంతకీ బ్యాచిలరా కాదా అన్నది తెలియాల్సి ఉంది.