నాగబాబు ఈ మధ్య తన ఛానల్ లో రాజకీయ నాయకుల గురించి కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పడూ నాగబాబు అమ్మాయిల డ్రెస్ ల గురించి కూడా మాట్లాడతున్నాడు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు వారు అలా ఆలోచించడాన్ని తప్పుబడుతూ ఓ వీడియో విడుదల చేశారు. మహిళల వస్త్రధారణ గురించి అలాంటి కామెంట్స్ చేయడం సరికాదు, వారికి నచ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఉంది... వారేమీ చట్టాలను అధిగమించి నగ్నంగా తిరగడం లేదు కదా అంటూ ఆయన తనదైన వాదన వినిపించారు. నాగబాబు వ్యాఖ్యలపై యాంకర్ రష్మి గౌతమ్, అనసూయ స్పందించారు.
ఆడవారైనా, మగవారైనా.... కేవలం వారు వేసుకునే దుస్తులను బట్టి జడ్జ్ చేయడం సరికాదు. ఒక పుస్తకం కవర్ పేజీ చూసి దాని అంచనా వేయడం ఎంత తప్పో... వ్యక్తుల వస్త్రధారణ బట్టి వారిని జడ్జ్ చేయడం అంతే తప్పు అని రష్మి తెలిపారు. తమ లాంటి వారికి మద్దతుగా నిలిచిన నాగబాబుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. డ్రెస్సింగ్ విషయంలో రష్మికి గతంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురైన సంగతి తెలిసిందే. డ్రెస్సింగ్ చాలా ఓవర్‌గా ఉందని, ఇంత ఎక్స్ ఫోజింగ్ చేయడం అవసరమా? అంటూ ఆమెను వేధించిన సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో నాగబాబు లాంటి వారు సపోర్టుగా నిలవడం రష్మికి ఊరటనిచ్చింది.
నాగబాబు వ్యాఖ్యలపై యాంకర్, నటి అనసూయ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయనపై గౌరవం మరింత పెరిగిందని తెలిపారు. అనసూయ కూడా డ్రెస్సింగ్ విషయంలో తరచూ విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కొందరు ఇంకా పాత బూజుపట్టిపోయిన సాంప్రదాయాలను పట్టుకుని గబ్బిలాల్లా వేలాడుతున్నారు. ఒక ఆడపిల్ల లేదా సినిమా నటి పొట్టి డ్రెస్ వేసుకుంది అని మాట్లాడుతున్నారే.... మీ దృష్టి వారి డ్రెస్సు మీదకు ఎందుకు వెళుతుంది? అమ్మాయి క్లీవేజ్ కనబడుతుంది, అమ్మాయి తొడలు కనబడుతున్నాయి, అమ్మాయి బొడ్డు కనబడుతుంది ఈ దృష్టి మీకు ఎందుకు వచ్చింది? ముందు మీ వక్రబుద్రి మానుకోండి. అంటూ నాగబాబు తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు.