విజయ దేవరకొండ అతి తక్కువ వయసులో టాలీవుడ్ లో స్టార్ హీరో స్టేటస్ ను సంపాదించుకున్నాడు. అయితే అప్పుడప్పుడు అతి చేస్తున్నాడని కొన్ని సార్లు విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా ఈ హీరో నెటిజన్స్ ట్రోలింగ్ కు గురైయ్యాడు. లేటెస్ట్ హిట్స్ తో ఇప్పటికే ఫోర్బ్స్-100 లిస్ట్ లో చోటుసంపాదించుకున్న ఈ కుర్రహీరో, తాజాగా ఫోర్బ్స్ 30 అండర్ 30 అనే మరో కొత్త జాబితాలో కూడా చోటు సాధించాడు. దీని అర్థం ఏంటంటే.. 30 ఏళ్ల లోపు యంగ్ ఎఛీవర్స్ తో టాప్-30 లిస్ట్ అన్నమాట. 29 ఏళ్ల దేవరకొండ ఈ జాబితాలోకి కూడా ఎక్కేశాడు. ఈ సందర్భంగా మనోడు ఓ ట్వీట్ వదిలాడు.

"నాకు పాతికేళ్లు ఉన్నప్పుడు ఆంధ్రాబ్యాంక్ అకౌంట్ ఉండేది. 500 రూపాయల మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని దాన్ని లాక్ చేసిండ్రు. 30 ఏళ్ల లోపు దాన్ని సెటిల్ చేస్కో అన్నాడు డాడ్. నాలుగేళ్ల తర్వాత చూసుకుంటే ఫోర్బ్స్ సెలబ్రిటీ 100, ఫోర్బ్స్ 30 అండర్ 30." ఇలా తన మనసులో ఉన్నది బయటపెట్టాడు దేవరకొండ. మనం 30లోపు ఉన్నప్పుడు, తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు సాధించేదే అసలైన సక్సెస్ అంటూ గర్వంగా రాసుకొచ్చాడు. కానీ ఇక్కడే నెటిజన్లకు కోపం వచ్చేసింది.

"అదృష్టం బాగుండి నువ్వు 30 ఏళ్ల లోపు సక్సెస్ అయ్యావు. అందరికీ నీలా అదృష్టం కలిసిరావాలి కదా. కేవలం హార్డ్ వర్క్ తోనే 30 ఏళ్ల లోపు నువ్వు సక్సెస్ కాలేదు.""సెల్ఫ్ డబ్బా.. ఇంకా అర్జున్ రెడ్డి నుంచి బయటకు రాలేదా విజయ్" ఇలా విజయ్ పై రివర్స్ లో కౌంటర్స్ స్టార్ట్ చేశారు నెటిజన్లు. ఫోర్బ్స్ జాబితాలోకి చేరినందుకు కంగ్రాట్స్ చెబుతూనే.. సెల్ఫ్ ఎలివేషన్ ఎక్కువైంది తగ్గించుకోమని ఉచిత సలహాలిచ్చారు. ప్రస్తుతానికైతే ఇతడి ఫ్లాట్ ఫామ్ పై ఓ 50శాతం మంది పాజిటివ్ గా స్పందిస్తే, మరో 50శాతం మంది గ్రూపుల్లో ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ ట్రోలింగ్స్ కు విజయ్ స్పందిస్తాడేమో చూడాలి.
 
Top