అక్కినేని వారసుడు అఖిల్ ఇప్పటికే రెండు సినిమా లు చేసి ఘోరమైన ఫ్లాప్స్ ను మూట కట్టుకున్నాడు. అయితే తన మూడవ సినిమా మిస్టర్ మజ్ను మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. యువదర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందించాడు. అఖిల్ కు జోడిగా నిధి అగర్వాల్ నటించింది. ట్రైలర్, టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మిస్టర్ మజ్ను చిత్రం పాజిటివ్ బజ్ తో నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. యూఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోలు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. 

మిస్టర్ మజ్ను చిత్ర ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. సెకండ్ హాఫ్ యావరేజ్ గా ఉంది. ఓవరాల్ సినిమా గురించి చెప్పాలంటే అబౌ యావరేజ్. మిస్టర్ మజ్ను చిత్రంతో అఖిల్ హిట్ కొట్టాడు. తొలి ప్రేమ తర్వాత వెంకీ అట్లూరి మరో హిట్. తమన్ తన సంగీతంతో చిత్రానికి ప్రాణం పోశాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. తమన్ అన్న ఈజ్ బ్యాక్.. మిస్టర్ మజ్ను చిత్ర ఫస్ట్ హాఫ్ హలా బావుంది. ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్ కలగలిపి ఉంది. అఖిల్ కు ఈ చిత్రంతో విజయం దక్కింది. 


కంగ్రాట్స్ అఖిల్ అన్న.. మిస్టర్ మజ్నుతో హిట్ కొట్టేశాం. తాతకు తగ్గ మనవడు.. తండ్రికి పోటీ ఇచ్చే కొడుకు అఖిల్. మిస్టర్ మజ్ను చిత్రంతో అఖిల్ లో చాలా మార్పు కనిపించింది. బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఈ చిత్రం కోసం తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. నిధి అగర్వాల్ నిక్కీగా పర్వాలేదనిపించింది. విక్కీ, నిక్కీ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాకపోవచ్చు. చాలా మంది ఈ కథతో కనెక్ట్ కావడం కష్టం. తమన్ సంగీతం బావుంది. మిస్టర్ మజ్ను చిత్రం సూపర్ హిట్ రిపోర్ట్స్ సొంతం చేసుకుంటోంది. కంగ్రాట్స్ నిధి అగర్వాల్. అందరూ నీ నటన గురించే మాట్లాడుకుంటున్నారు. నిధి అగర్వాల్ లుక్స్ చాలా బావున్నాయి. నిక్కీగా నిధి అగర్వాల్ ఉత్తమ నటన కనబరిచింది. 
 
Top