ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో ‘మీ టూ ’ ఉద్యమం నేపథ్యంలో ఎంతో మంది నటీమణులు గతంలో తమపై జరిగిన లైంగిక దాడుల గురించి సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.  బాలీవుడ్ లో తనూశ్రీ దత్త, కంగనా రౌనత్ మరికొంత మంది నటీమణులు తమను లైంగికంగా వేధించిన వారి పేర్లు బయట పెట్టి సంచలనం రేపారు.  ఇక సింగర్ చిన్మయి కూడా మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ రచయిత వైరముత్తు పై సంచలన ఆరోపణలు చేసింది.  ఇలా నటీమణులు కాదు ఇతర రంగాల్లో పని చేస్తున్న కొంత మంది మహిళపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు జరుగుతున్నాయని బహిరంగంగా చెబుతున్నారు. తాజాాగా ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన హీరోయిన్  పాయల్ రాజ్ పుత్ సైతం లైంగిక వేధింపులను ఎదుర్కొందట.

తొలి తెలుగు చిత్రంలో హాట్ సన్నివేశాల్లో నటించి, కుర్రకారును మత్తెక్కించిన ఈ భామ, 'మీటూ' ఉద్యమంపై స్పందిస్తూ, టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ నిజమేనని అంగీకరించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సినిమా రంగానికి రావలాంటే ఎన్నో ఆంక్షలు ఎదుర్కొని రావాలని..ముఖ్యంగా కొంత మంది దళారులు ఆడవాళ్లను దారుణంగా ఉపయోగించుకోవడానికి  ప్రయత్నిస్తుంటారని..వారి వీక్ నెస్ పై దెబ్బ కొట్టాలని చూస్తారని ఆవేదన వ్యక్తం చేసింది.  తాను నటిగా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత కూడా లైంగిక దాడి మాత్రం తప్పించుకోలేక పోయానని అంటుంది. 

తన మొదటి సినిమాలో బోల్డ్ గా నటించిన తనను అందరూ అలాగే చూస్తున్నారని వాపోయింది. అంతే కాదు ఇలాంటి పాత్రల్లో నటిస్తే మరిన్ని అవకాశాలు ఇస్తామని చెప్పారు.  ఇటీవల ఓ సినిమాలో అవకాశం ఇస్తానంటూ ఓ వ్యక్తి కలిశాడని, ఆఫర్ ఇస్తే తనకేమిస్తావని అడిగాడని, ఈ ప్రశ్నతో షాక్ కు గురయ్యానని చెప్పింది.

అతడి మాటలు వింటుంటే..నా కోపం ఆపుకోలేక పోయానని..చెంప ఛెల్లుమనిపించానని అన్నారు. నా టాలెంట్ కు టాలీవుడ్ లో గుర్తింపు లభించిందేకానీ, ముద్దు సీన్లలో నటించినందుకు కాదని అతనికి గట్టిగానే చెప్పి, అతనిచ్చిన ఆఫర్ ను తిరస్కరించి వచ్చేశానని వ్యాఖ్యానించింది.  అయితే తనను అంతగా వేధించిన వ్యక్తి పేరు మాత్రం బయట పెట్టలేదు ఈ ముద్దుగుమ్మ. 
 
Top