ఆంటీ ఈ పదం వింటే చాలు.. మహిళలు ముఖం చిట్లించుకుంటారు. అది 20ఏళ్లయినవారైనా సరే.. 60 ఏళ్లయిన వారైనా సరే.. అది మహిళల బలహీనతగా చెప్పుకోవచ్చేమో.. వయస్సు పెరగడాన్ని మగవాళ్లు తీసుకున్నంత ఈజీగా ఆడవారు తీసుకోలేకపోవచ్చు.
అందుకే ఎవరైనా ఆంటీ అని పిలిస్తే ఆంటీలు కూడా మండిపడతారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది.. ఆంటీల మనస్తత్వాన్ని బాగా స్టడీ చేసినట్టున్నాడు. అందుకే తాజాగా జబర్దస్త్ లో ఆంటీ అంటూ రోజా వెనక పడ్డారు. ఆంటీ అనగానే రోజా ఫైర్ అయితే పంచ్ బాంబు పేల్చాడు.
ఆంటీని ఆంటీ అంటే మండిపడని ఆంటీ ఆంటీయే కాదు... అంటూ ఓ జనరల్ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు హైపర్ ఆది. చూడటానికి పంచ్ డైలాగ్ లా ఉన్నా.. మహిళల మనస్తత్వాన్ని ఒక్క వాక్యంలో చెప్పే డైలాగ్ అది.
ఇక్కడే మరో విచిత్రం కూడా ఉంది.ఆంటీలను ఆంటీ అంటే కోప్పడతారు.. కానీ కుర్రాళ్లేమో ఆంటీలంటే ఇష్టపడుతుంటారు.అలాంటి ఆకర్షణను తెరపై చూపేలా హైపర్ ఆది కూడా అనసూయతో రొమాన్స్ చేస్తూ అలరిస్తున్నాడు. ఇదీ హైపర్ ఆదీ ఆంటీ పురాణం.