రామ్ చరణ్ భార్య ఉపాసన మెగా కోడలుగా మాత్రమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన సెలెబ్రెటీ హోదాలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాలలో పాల్గొంటున్న ఈమె అక్కడ ఆ సమావేశానికి వచ్చిన అనేకమంది ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో పాటు మైక్రోసాఫ్ట్ అధినేత సత్యానాదెండ్లను కలిసి మైక్రోసాఫ్ట్ అపోలో సంస్థలు కలిసి చేబట్టబోయే హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ గురించి చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా ఉపాసన చిరంజీవికి ఈమధ్య వచ్చిన ఒక బిజినెస్ ఆలోచనలను అంగీకరించనట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు నిర్మించిన మల్టీఫ్లెక్స్ ధియేటర్స్ విజయవంతం కావడంతో ఇండస్ట్రీలోని టాప్ హీరోల దృష్టి అంతా మల్టీ ప్లెక్స్ ధియేటర్ల నిర్మాణం పై పడింది.
మహేష్ వ్యూహాలను అనుసరిస్తూ అల్లు అర్జున్ కూడ హైదరాబాద్ లో ఒక భారీ మల్టీ ప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఇదే వ్యాపారంలోకి చిరంజీవి కూడ ప్రవేశించాలి అన్న ఆలోచనలతో చిరంజీవి చరణ్ వరుణ్ తేజ్ లతో కలిసి భాగ్యనగరంలో ఒక భారీ మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టే ఆలోచనలు చేస్తున్న సందర్భంలో ఈ ఆలోచనలు తనకు నచ్చలేదు అని ఉపాసన ఏకంగా చిరంజీవికి డైరెక్ట్ గా చెప్పి చిరంజీవికి షాక్ ఇచ్చినట్లు టాక్. అంతేకాదు మల్టీప్లెక్స్ ధియేటర్స్ బిజినెస్ విషయంలో హడావిడి ఎక్కువగా ఉంటుంది కాని లాభాలు తక్కువగా ఉంటాయని ఉపాసన తన అభిప్రాయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకు వచ్చినట్లు సమాచారం.
అయితే మల్టీఫ్లెక్స్ ధియేటర్స్ విషయంలో మెగా కుటుంబానికి ఉన్న అభిరుచిని గ్రహించిన ఉపాసన ఈవిషయంలో ఈ ప్రాజెక్ట్ స్టడీ చేసిన తరువాత ఫైనల్ నిర్ణయం తీసుకుందామని సలహా ఇచ్చినట్లు ఒక మీడియా సంస్థ ఆసక్తికర కథనాన్ని వెలుగులోకి తీసుకు వచ్చింది. ఉపాసన కు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టే దేశంలోని ప్రతిభావంతమైన మహిళలకు సంబంధించిన ఫోబ్స్ పత్రిక లిస్టులో ఉపాసనకు స్థానం లభించింది..