సాధారణంగా తమ అభిమాన హీరోకి మంచి హిట్ వస్తే..ఆ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు ఉండవు.  థియేటర్ల వద్ద ఆ ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ విషయంలో తమిళ తంబీల అభిమానం కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు.  తమ అభిమాన హీరో చిత్రం హిట్ టాక్ వచ్చిందంటే..థియేటర్ల వద్ద భారీ సంఖ్యలు సంబరాలు చేసుకుంటారు.  పెద్ద పెద్ద కటౌట్లు ఏర్పాటు చేసి..అన్నదానాలు, స్వీట్లు పంచడం, బట్టలు పంచడం, పాలాభిషేకాలు చేయడం లాంటివి చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. 

తాజాగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ‘చెక్క చివంత వానం’ తెలుగు లో ‘నవాబ్’హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లతో దూసుక వెళ్తుంది.  ఈ చిత్రంలో అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు ప్రధాన పాత్రల్లో నటించారు.  అయితే ఈ సినిమాలో హీరో శింబు పోషించిన రుద్ర అనే ఆయుధాల డీలర్ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.  ఇంకేముంది..శింబు ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.  ఇక ఓ అభిమాని తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.

క్రేన్ కొక్కేలను శరీరానికి గుచ్చుకున్న ఓ శింబు అభిమాని.. గాల్లోకి లేచి 25 అడుగుల ఎత్తు ఉన్న శింబు పోస్టర్ కు పాలాభిషేకం చేశాడు.  దాంతో చూసిన వారంతా వీడి అభిమానం తగెలయ్యా..మరీ ఇంత పిచ్చి అభిమానం ఏంటా అని ఆశ్చర్యపోయారు. తాజాగా  ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, సదరు అభిమాని చర్యను చాలామంది నెటిజన్లు తప్పుపడుతున్నారు.

 
 
Top