‘అరవింద సమేత వీరరాఘవ’ ట్రయిలర్ బయటకు వచ్చి ఒక్కరోజు కూడ పూర్తి కాకుండానే ఈమూవీ ట్రైలర్ పై యాంటీ ఫ్యాన్స్ దాడి విపరీతంగా జరుగుతోంది. ఈమూవీని ఎట్టి పరిస్తుతులలోను హిట్ కాకుండా ముందుగానే చెక్ పెట్టాలి అని ప్రయత్నిస్తున్న జూనియర్ వ్యతిరేకులు ఈమూవీ ట్రైలర్ పై పెదవి విరుస్తూ త్రివిక్రమ్ సినిమాలో ఈ ఫైట్స్ హింసా ఏమిటి అంటూ అప్పుడే నెగిటివ్ ప్రచారంలోకి దిగిపోయారు.

అయితే అసలు ఈసినిమాకు సంబంధించి రియల్ సీక్రెట్ వేరు అన్న ప్రచారం జరుగుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు రెండున్నర గంటల నిడివి ఉండే ‘అరవింద సమేత’ లో ఒక అరగంట మాత్రమే విపరీతమైన హింసకు సంబంధించిన సీన్స్ ఉంటాయనీ మిగిలిన రెండు గంటలలో ఒక గంట వరకు జూనియర్ లవర్ బాయ్ ఇమేజ్ తో కనిపిస్తే సెకండ్ ఆఫ్ అంతా మెసేజ్ ఓరియెంటెడ్ గా ఫ్యాక్షన్ జనాలను మాటలతో మంచి తనంతో మార్చే జూనియర్ పాత్ర మరో గంట కనిపిస్తుందని అంటున్నారు.

ఇప్పుడు హడావిడి చేస్తున్న ఈవార్తలు ఈమూవీ ఓవర్సీస్ బయ్యర్ కు కలవరపాటు కలిగిస్తున్నట్లు టాక్. సాధారణంగా ఓవర్సీస్ ప్రేక్షకులు విపరీతమైన హింసతో ఉన్న సినిమాలను ఇష్టపడరు. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ సినిమాలలో ఇలాంటి సన్నివేశాలను ఓవర్సీస్ ప్రేక్షకులు జీర్ణించుకోలేరు.

దీనితో బాగా ఆలోచించి త్రివిక్రమ్ కట్ చేసిన ట్రైలర్ కు ఆదిలోనే నెగిటివ్ కామెంట్స్ రావడం సంచలనంగా మారింది. దీనికితోడు ‘అరవింద సమేత’ లో జగపతి బాబు గెటప్ ‘రంగస్థలం’ మూవీలోని జగపతి బాబు గెటప్ ను పోలి ఉండటంతో త్రివిక్రమ్ గొప్పతనం ఏమిటి అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. మరి కొందరైతే మరొక అడుగు ముందుకు వేసి ప్రభాస్ ‘మిర్చి’ జూనియర్ ‘దమ్ము’ కలిపితీసిన మూవీగా ‘అరవింద సమేత’ మారుతుందా అంటూ మొదలైపోయిన నెగిటివ్ ప్రచారం ‘అరవింద’ బయ్యర్లకు నిద్రను కూడ దూరం చేస్తోంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..
 
Top