పొడుగు కాళ్ళ సుందరి శిల్ప శెట్టి తన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టింది. బిగ్ బ్రదర్ రియాల్టీ షో విజేతగా నిలిచాక ఆ మరుసటి ఏడాదే హిందీ బిగ్‌బాస్ రెండో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు బాలీవుడ్ నటి శిల్పాశెట్టి. రచయితగా రాణించిన ఈ పొడుగు కాళ్ల సుందరి రియాల్టీ డేటింగ్‌ షో ‘హియర్‌ మి, లవ్‌ మి’కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ‘హియర్‌ మి, లవ్‌ మి’ షో ప్రస్తుత యువతరానికి తగ్గట్లుగా ఉంటుందన్నారు. ప్రస్తుతం రియాల్టీ షోలకు ఆదరణ పెరిగిందని చెప్పారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో షో ప్రసారం అవుతుందని తెలిపారు.

‘హియర్‌ మి, లవ్‌ మి’ డేటింగ్ షో గురించి మాట్లాడిన శిల్పాశెట్టి గతంలో తన డేటింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ‘17 ఏళ్ల వయసులో బాజీఘర్ మూవీ చేశాను. అప్పుడు నేను కాలేజీ విద్యార్థిని అంటే 12వ తరగతి. ఓ యువకుడిని గుడ్డిగా ప్రేమించి మోసపోయాను. ప్రతిరోజూ సాయంత్రం ఓ యువకుడు మా ఇంటికి ఫోన్‌ చేసేవాడు. ఆ వయసులో ఇలాంటి వాటికి త్వరగా ఆకర్షితులవుతాం. అసలే ఆ సమయంలో ఇంట్లో ల్యాండ్‌లైన్ ఫోన్ మాత్రమే ఉండేది. రోజూ అతడి ఫోన్ కోసం ఎదురుచూసేదాన్ని.

అయితే అబ్బాయి పేరు నేను అడగలేదు. అతడు కూడా చెప్పలేదు. విషయం ఏంటో తేల్చేద్దామని బస్టాప్‌లో కలుద్దామని అతడికి ఓరోజు చెప్పేశా. కానీ అతడు మాత్రం రాలేదు. దీంతో ప్రేమలో ఫెయిలయ్యానని గుండె పగిలి బాధపడ్డా. నా మనసు విరిగిపోయింది. కొన్ని రోజులకు అసలు విషయం తెలిసి నవ్వుకున్నా. నాతో ఫోన్‌లో మాట్లాడి ప్రేమలో పడేస్తానని నా స్నేహితులతో ఆ అబ్బాయి పందెం కట్టాడని తెలిసింది. పందెం గెలిచినా అతడు నాతో బంధాన్ని తెంచుకున్నాడని ఎన్నో రోజులు కుమిలిపోయానని’ తన గత అనుభవాలను నటి శిల్పాశెట్టి వివరించారు.
 
Top