యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమాలో ఎన్.టి.ఆర్ డ్యుయల్ రోల్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ఒక్కడు కాదు ఇద్దరని అంటున్నారు. ఒకరు సిటీలో ఉంటుండగా.. మరొకరు రాయలసీమలో ఉంటారట.

అందుకే సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్దె, ఈషా రెబ్బ నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. వీర రాఘవ ఒక్కడా ఇద్దరా అన్న కన్ ఫ్యూజన్ నందమూరి ఫ్యాన్స్ లో కూడా ఉంది. అయితే వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఎన్.టి.ఆర్ ద్విపాత్రాభినయం చేశాడని అంటున్నారు.

జై లవ కుశ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో త్రివిక్రం సినిమా మొదలు పెట్టాడు ఎన్.టి.ఆర్. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో మొదటిసారిగా వస్తున్న ఈ మూవీపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమాతో కూడా హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.
అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినా ముందు ఇచ్చిన కమిట్మెంట్ కోసం త్రివిక్రం తో ఈ సినిమా చేశాడు ఎన్.టి.ఆర్. ఈ సినిమాతో త్రివిక్రం మరోసారి తన పెన్ పవర్ ఏంటో చూపించాలని చూస్తున్నాడు. మరి దసరా బరిలో దిగుతున్న అరవింద సమేత వీర రాఘవుడి సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. 
 
Top