మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం సినిమాతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్న రాం చరణ్ మణిరత్నం డైరక్షన్ లో ఓ సినిమా కాదన్నాడని తెలిసిందే. దాదాపు సినిమా డిస్కషన్స్ అన్ని జరిగాక ఎందుకో చివరి నిమిషంలో చరణ్ మణిరత్నం కు సారీ చెప్పాడు.

చరణ్ కాదన్న ఆ సినిమాను తమిళ నటీనటులతో చేశాడు మణిరత్నం. ఈమధ్య వచ్చిన నవాబ్ సినిమాలోనే చరణ్ ను కూడా తీసుకోవాలని చూశాడు మణిరత్నం. శింభు పాత్రలో చరణ్ ని అనుకున్నాడట. కాని చరణ్ కాదనేసరికి ఆ పాత్రకి శింభుని ఎంచుకున్నాడు. ఇక సినిమాలో అరవింద స్వామి విలనిజం అదరగొట్టాడు.

నవాబ్ సినిమా చూశాక ఒకవేళ చరణ్ ఈ సినిమా చేసి ఉంటే కచ్చితంగా తన ఇమేజ్ మీద ఎఫెక్ట్ పడేదని అంటున్నారు. తెలుగు ఆడియెన్స్ కు ఇలాంటి ఎక్స్ పెరిమెంట్స్ నచ్చవు. అందుకే చరణ్ తీసుకున్న నిర్ణయం మంచిదే అని అంటున్నారు. మెగా ఫ్యాన్స్ అయితే చరణ్ మణిరత్నం సినిమా కాదని మంచి పని చేశాడని ఊపిరి పీల్చుకుంటున్నారు.
 
ఇక ఇదే సినిమా కథను తమిళ స్టార్ హీరో విజయ్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ లతో కలిపి సినిమా చేయాలని అనుకున్నాడు మణిరత్నం. ఆ ఇద్దరు కూడా వారి సినిమాల బిజీ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమా వదులుకున్నారు. తమిళ ఆడియెన్స్ కు నవాబ్ నచ్చే అవకాశాలు ఉన్నా.. తెలుగులో మాత్రం ఇదో యావరేజ్ మూవీగానే మిగులుతుందని చెప్పొచ్చు.
 
Top