సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమా తర్వాత చేస్తున్న సినిమా మహర్షి. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ముగ్గురు బడా నిర్మాతలైన దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారని తెలిసిందే.
2019 ఏప్రిల్ 5 ఉగాది కానుకగా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా అప్పుడే రికార్డుల మొదలుపెట్టాడు. ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో మహేష్ ఇంతవరకు ఎప్పుడు చేయని బిజినెస్ చేస్తాడని అంచనా వేస్తుండగా హింది రైట్స్ కూడా అంచనాలకు మించి ఫ్యాన్సీ ఎమౌంట్ కు అమ్ముడయ్యాయట.
తెలుస్తున్న సమాచారం ప్రకారం మహర్షి హింది రైట్స్ 25 కోట్ల దాకా పలికాయట. హిందిలో ఇప్పుడు తెలుగు సినిమాల హవా నడుస్తుంది. ఈమధ్య తెలుగు సినిమాలు కొన్ని యూట్యూబ్ లో కూడా సంచలనాలు సృష్టిస్తుంది. అందుకే హిందిలో మహేష్ సినిమాకు ఈ రేంజ్ క్రేజ్ ఏర్పడింది.
చరణ్ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా 22 కోట్లకు అమ్మేశారట. ఇప్పుడు మహేష్ ఏకంగా పాతిక కోట్లకు మహర్షితో మరో రికార్డ్ సాధించాడు. మహేష్ 25వ సినిమాగా వస్తున్న మహర్షి ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్ల దాకా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.