ఆరు పదుల వయసుకు దగ్గర పడుతున్నా ఇంకా టాలీవుడ్ ‘మన్మధుడు’ అని చాలమందితో పిలిపించుకునే నాగార్జున ఈవారం విడుదల అవుతున్న తన మల్టీస్టారర్ ‘దేవదాస్’ ను ప్రమోట్ చేస్తూ ఒకప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలను షేర్ చేస్తూ ఎన్టీఆర్ బయోపిక్ పై కూడ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. అలనాటి తనతండ్రి ‘దేవదాసు’ నుండి ఈనాటి తన ‘దేవదాస్’ వరకు ఎన్నో సినిమా కబుర్లను కూడ షేర్ చేసుకున్నాడు.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎన్టీఆర్ బయోపిక్ గురించి మాట్లాడుతూ తనను ఆసినిమాలో నటించమని బాలకృష్ణ కానీ క్రిష్ కానీ అడగలేదు అంటూ వాస్తవానికి తనకు తన తండ్రి అక్కినేనికి ఎటువంటి పోలికలు లేని నేపధ్యంలో తనను ఎన్టీఆర్ బయోపిక్ లో నటించమని అడుగుతారని తానెప్పుడు ఊహించలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో ఎన్టీఆర్ బయోపిక్ లో అక్కినేని పాత్రను పోషిస్తున్న సుమంత్ గురించి మాట్లాడుతూ ఒక్క ఎత్తు విషయంలో పట్టించుకాకపోతే తన తండ్రి అక్కినేని పోలికలు సుమంత్ లో స్పష్టంగా కనిపిస్తాయని అందువల్ల తనకన్నా సుమంత్ అక్కినేని పాత్రలో నటించడం సమంజసం అంటూ కామెంట్స్ చేసాడు.

ఇదేసందర్భంలో తన కొడుకులు నాగచైతన్య అఖిల్ గురించి మాట్లాడుతూ తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనలోని లోపాలను క్షమించి తనను టాప్ హీరోగా ప్రేక్షకులు ఆశీర్వదించినట్లుగా చైతన్య - అఖిల్ లలో ఉన్న లోపాలను కూడ అక్కినేని అభిమానులు ఓర్పుతో భరిస్తున్నారు అంటూ జోక్ చేసాడు. ఇక తన గ్లామర్ సీక్రెట్ గురించి మాట్లాడుతూ తాను ప్రతిరోజు ఒక ఐస్ క్రీం తింటూ ఒక స్వీట్ తప్పనిసరిగా తింటానని అయితే ఈవిషయాలను తాను నిజంగా చెప్పినా ఎవరు నమ్మరు అని అంటూ టెన్సన్స్ లేకుండా ఉంటే చాలు ఎవరైనా అందంగా ఉంటారని తోటపని చేసైనా సంతోషంగా ఉండవచ్చు అంటూ తన బ్యూటీ సీక్రెట్ బయటపెట్టాడు.

‘రామదాసు’ ‘అన్నమయ్య’ ‘షిరిడీ సాయి’ లాంటి భక్తి సినిమాలలో నటించినా తనకు భక్తి అంటే అంతర్లీనంగా వచ్చిన భావన మాత్రమే అన్ననమ్మకం ఉంది కానీ పెద్దగా పెద్దపెద్ద పూజల పై నమ్మకాలు లేవు అంటూ కామెంట్స్ చేసాడు. ఈరోజు ప్రతి వ్యక్తికి వారివారి స్థాయిలలో ఎదురౌతున్న అశాంతి గురించి మాట్లాడుతూ ఫలితాల గురించి విపరీతమైన టెన్షన్ పడటం వల్లే అశాంతి వస్తోందని ఫలితం గురించి ఆలోచించడం మానివేసినప్పుడు మాత్రమే నేటియువతలో పెరిగిపోతున్న అశాంతికి పరిష్కారం దొరుకుతుంది అని అంటున్నాడు ఈ దేవదాస్..  
 
Top