యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కలిసి మొదటిసారి చేసిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో గార్జియస్ బ్యూటీ పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ హెచ్.ఐ.సి.సిలో జరిగింది.

కేవలం చిత్రయూనిట్ సమక్షన్లో జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్.టి.ఆర్ స్పీచ్ అన్నిటికంటే హైలెట్ గా నిలిచింది. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని తారక్ వేదిక మీద అభిమానులతో తన బాధని పంచుకున్నాడు. ఇక సినిమాలో పనిచేసిన అందరు సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.

ఈ సినిమాతో మళ్లీ సునీల్ కమెడియన్ గా కెరియర్ యూటర్న్ తీసుకున్నాడు. మనిషి జీవితంలో తల్లి, తండ్రి, స్నేహితుడు, గురు ఇలా ఒకానొక సమయంలో ఒకానొక వ్యక్తి తోడుగా ఉంటాడు. అయితే ఇవన్ని తన జీవితంలో త్రివిక్రం అని. ఓ మంచి స్నేహితుడిని సంపాదించుకుంటే చాలంటూ చెప్పాడు సునీల్. ఇక ఎన్.టి.ఆర్ గురించి చెబుతూ తన సీటు కూడా ఇచ్చి కూర్చోమనే మంచి మనసు తారక్ ది అని అన్నాడు.

తానెన్ని వేశాలేసినా చివరకు తనకు మంచి వేశం ఇచ్చిన త్రివిక్రం కు థ్యాంక్స్ అన్నాడు సునీల్. సినిమా కొంచం కొంచం చూశానని సినిమా అదిరిపోద్దని.. నందమూరి ఫ్యాన్స్ కు ఇది పండుగ లాంటి సినిమా అని అన్నారు సునీల్. దసరా కానుకగా అక్టోబర్ 11న అరవింద సమేత వీర రాఘవ రాబోతున్నాడు. మరి ఈ వీర రాఘవ విధ్వంసాలు ఎలా ఉంటాయో చూడాలంటే మరో 9 రోజులు వెయిట్ చేయాల్సిందే.
 
Top