కొద్ది సేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ లోని కీలక పట్టణాలలో అదేవిధంగా ఓవర్సీస్ లో ‘అరవింద సమేత’ షోలు ప్రారంభం కావడంతో ఈమూవీ రిజల్ట్ కు సంబంధించిన తొలి లీకుల కోసం ఇండస్ట్రీ వర్గాలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడ ‘అరవింద సమేత’ టిక్కెట్స్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడటంతో మూవీ టిక్కెట్స్ హాట్ కేక్ లా అమ్ముడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం బయటకు వస్తున్న ప్రాధమీక సమాచారం ప్రకారం ఈసినిమా ప్రీమియర్ కలక్షన్స్ అప్పుడే హాఫ్ మిలియన్ డాలర్స్ క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. అమెరికాలోని 192 లోకేషన్స్ లో విడుదలైన ఈమూవీ ప్రీమియర్ కలక్షన్స్ మాత్రమే లక్కలోకి తీసుకుంటే 1 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేస్తుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈమూవీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మూడు మిలియన్ డాలర్స్ కలక్షన్స్ క్రాస్ చేయడం చాల సులువు అని అంటున్నారు.

ఇక ఈమూవీ సంబంధించిన మ్యానియా మన తెలుగు రాష్ట్రాలలో కూడ స్పష్టంగా కనిపిస్తున్న నేపధ్యంలో ‘అరవింద సమేత’ మొదటిరోజు కలక్షన్స్ 25 కోట్లు క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.  ముఖ్యంగా ఓవర్సీస్ లో త్రివిక్రమ్ జూనియర్ ల కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ ఇలాంటి భారీ కలక్షన్స్ కు ఆస్కారం కలిగిస్తోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఎంత టాప్ హీరోకి అయినా తన సినిమాకు సంబంధించి ఫస్ట్ డే షేర్ అన్నది అత్యంత కీలకం కావడంతో ‘అరవింద సమేత’ ఓపెనింగ్ డే కలక్షన్స్ రికార్డులు ఇండస్ట్రీ టాప్ 5 లో ఉంటాయి అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. టాప్ ఫైవ్ లో బాహుబలినే రెండు ఫ్లేస్ లు 22 కోట్లు 42 కోట్లకు పైగా వసూలు చేసి ఆక్యు పై చేస్తే ఇక మిగిలిన మూడు ప్లేస్ ల్లో పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ ‘కాటమరాయుడు’ 27 కోట్లు 23 కోట్ల స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక ఐదవ స్థానాన్ని చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ తీసుకుంది. అంచనాల ప్రకారం ‘అరవింద సమేత’ ఓపెనింగ్ డే కలక్షన్స్ 25 కోట్ల స్థాయిలో వస్తే పవన్ రికార్డ్ లను బ్రేక్ చేసిన తొలి నందమూరి హీరోగా జూనియర్ రికార్డులు సృష్టించడం ఖాయం అని అంటున్నారు..
 
Top