ఎన్నో అంచనాల నడుమున ఈ రోజు అరవింద బెనిఫిట్ షో పడింది.  త్రివిక్రమ్ ఎన్టీఆర్ అరుదైన కాంబినేషన్ కావడం తో అభిమానుల తో పాటు సాధారణ ఆడియన్స్ కూడా సినిమా కోసం ఎగబడ్డారు. ఇండియా రిలీజ్ కంటే ముందే యూఎస్ఏలో ప్రీమియర్ షోలు పడటంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో తెల్లవారు ఝామునే బెనిఫిట్ షోలు పడ్డాయి. అన్ని చోట్ల నుండి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.

పలువురు ఆడియన్స్‌తో పాటు అభిమానులు ట్విట్టర్ ద్వారా సినిమాపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ ట్వీట్స్ చేశారు. ఈ చిత్రంపై టాక్ ఎలా ఉంది? ఎన్టీఆర్ పెర్పార్మెన్స్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించో వారి ట్వీట్లోనే చూద్దాం. దర్శుకుడు త్రివిక్రమ్ మొదటి సీన్ నుండి శాంతి సందేశం ఇవ్వడం మొదలు పెట్టాడు. ఈ పాయింటుకు ఎంత మంది కనెక్ట్ అవుతారో తెలియదు. కథలో కొత్తదనం కనిపించలేదు.

త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగుల మీద మరింత శ్రద్ధ పెడితే బావుండేది. పెనివిటి సాంగ్ నిరాశ పరిచింది. సినిమాలో తారక్ ఎంట్రీ సీన్, జగపతి బాబు యాక్టింగ్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ హైలెట్. స్క్రీన్ ప్లే, బ్యాగ్రౌండ్ స్కోర్, రోటీన్ కథ, స్లో నేరేషన్ మైనస్ పాయింట్స్. తారక్ కోసం చూడొచ్చు. సూపర్ డూపర్ మాస్ హిట్. సెకండాఫ్ సూపర్. పర్ఫెక్ట్ రాయలసీమ ప్యాక్షన్ మూవీ. త్రివిక్రమ్ దర్శకత్వం, తారక్ యాక్టింగ్ అద్భుతంగా ఉంది. అరవింద సమేత బ్లాక్ బస్టర్ బొమ్మ అంటూ కొందరు తారక్ ఫ్యాన్స్ సినిమాపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రచయితగా త్రివిక్రమ్ కంబ్యాక్ మూవీలా ఉంది. తారక్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. హిట్ మూవీ.
 
Top