ఇప్పటి వరకు తెలుగులో ఎన్న అద్భుతమైన పాటలు పాడిన గీతామాధురి ఈ మద్య బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న విషయం తెలిసిందే.  ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని గీతా మాధురి రన్నరప్ గా నిలిచింది.  బిగ్ బాస్ హౌజ్ లో ఎన్నో టాస్క్ లు..రిస్క్ లు, గేమ్ షోలు ఇలా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది.  గీతా మాధురి బిగ్ బాస్ 2 ర‌న్న‌ర‌ప్ గా గెలిచి య‌మ క్రేజ్ తెచ్చుకుంది.

ఈ క్రేజ్ తో ఆమెకు హీరోయిన్ న‌టించే ఛాన్స్ వెతుక్కుంటూ వ‌చ్చింది. యాక్షన్, థ్రిల్లర్ సినిమాలో నటించే అవకాశం రావడంతో గీతా ఓకే చెప్పేసిందట.  త్వరలోనే సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది. క‌త న‌చ్చ‌డం వ‌ల్లే ఈ మూవీ ఒప్పుకున్నాన‌ని తెలిపింది గీతా మాధురి.. సినిమాలలో నటించినంత మాత్రం పాటలు పాడడం ఆపనని తెలిపింది. 

 'అతిథి' అనే లఘు చిత్రంలో నటించింది. దీనితో త్వరలో వెండితెరపై కనిపించనుందనే వార్తలు వచ్చేశాయి. ఇప్పటికే ఆమె ఒక చిత్రంలో నటించిందనీ.. ఆ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. త్వరలో దీనిపై ఆమె వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
 
Top