సినీ ఇండస్ట్రీ లోని చీకటి భాగోతాలను హీరోయిన్స్ ఒక్కొక్కరు బయటికి చెబుతున్నారు.  తాజాగా అందాల తార అమీరా దస్తర్ కూడా లైంగిక వేధింపులను బయటపెట్టింది. తనను వేధించిన వాళ్లంతా సమాజంలో పెద్దలు, వారి పేర్లు బయటకు చెప్పే ధైర్యం లేదు. కానీ ఏదో రోజు వారి పేర్లను బయటపెడుతానని అమీరా దస్తర్ హెచ్చరించింది. ఆమె వెల్లడించిన విషయాలు ఏమిటంటే. 

లైంగిక వేధింపుల విషయంలో ఆడ, మగ తేడా లేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో, బాలీవుడ్‌లో ఆడవాళ్లు, మగవాళ్ల చేతిలో మోసపోయాను. చాలా దారుణంగా వేధింపులకు గురయ్యాను. వారి పేర్లు ఇప్పుడు వెల్లడించను. కానీ ఏదో రోజు వారి గురించి ప్రస్తావిస్తాను అని అమీరా వెల్లడించింది. బాలీవుడ్‌లోనో లేదా దక్షిణాది చిత్ర పరిశ్రమలోనో లైంగిక వేధింపులకు గురయ్యాననుకొంటే పొరపాటే. ఈ రకమైన దారుణాలు అన్ని చోట్ల ఉన్నాయి. నాకు ఓ సినిమాకు సంబంధించిన పాట షూట్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఓ హీరో వచ్చి నా చెవిలో నీవు మా సినిమాలో నటించడం నాకు గర్వంగా ఉందని మీద పడ్డాడు. దాంతో ఆయనను తోసేశాను. ఆయన చేసిన పనిని చిత్ర యూనిట్‌కు చెప్పాను. దాంతో ఆయన నాపై చెడుగా మాట్లాడాడు. ఆ తర్వాత షూట్ ఉన్న రోజులు నాకు దుర్భరమైన పరిస్థితులు ఎదురయ్యాయి.

దక్షిణాదిలోనూ, బాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. ఇండస్ట్రీలో వాళ్లు చాలా పవర్‌ఫుల్. అందుకే వారి గురించి చెప్పడం లేదు. ఆడ, మగ అనే తేడాలేకుండా నన్ను వంచించారు. ఆ పరిస్థితుల్లో వారితో పోరాడే శక్తి లేదు అని అమీరా దస్తర్ పేర్కొన్నది. ఇండస్ట్రీలో పెద్దల ముసుగులో ఉన్న వారి భరతం పడుతాను. ఎప్పుడైతే నేను సేఫ్ అని భావిస్తానో. అప్పడే వారివైపు వేళ్లను చూపిస్తాను. నేను మాట్లాడుతున్న తీరును బట్టి వారెవరో, వారు ఏం చేశారో అనేది వారికి తెలుసు. ఇకనైనా ఈ దారుణాలను ఆపాలి. ఇండస్ట్రీలో మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. వారు చేసిన పనులకు వారే కర్మను అనుభవించాల్సి ఉంటుంది. 
 
Top