తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు వచ్చారు..వస్తున్నారు. అంతే కాదు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంత మంది కమెడియన్లు ఏ ఇండస్ట్రీలో లేరట. ఇంత మంది కమెడియన్లు ఉన్న ఎవరి మద్య పోటీ తత్వం ఉండకపోవడం మరో విశేషం.   తెలుగు ఇండస్ట్రీలో థర్టీఇయర్స్ ఇండస్ట్రీలో అంటూ కడుపుబ్బా నవ్వించే ఫృథ్వి ఇండస్ట్రీలో చాలా సీనియర్ అయినప్పటికీ మనోడికి మాత్రం గత ఐదు సంవత్సరాల నుంచి గోల్డెన్ టైమ్ నడుస్తుంది.  ఇండస్ట్రీలో తనదైన పేరడీ డైలాగ్స్ తో అందరినీ నవ్విస్తున్న ఫృథ్వి దర్శకధీరుడు రాజమౌళికి పెద్ద షాక్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.  
అసలు విషయానికి వస్తే..గతంలో ఓ సినిమాలో బాహుబలికి సంబంధించిన స్పూఫ్ లో ఫృథ్వినటించారు. అప్పట్లో అది పాపులర్ కావడం మనోడు రాజమౌళి దృష్టిలో పడటం జరిగింది. దీంతో బాహుబలి 2 లో ఫృథ్వి కి మంచి చాన్స్ ఇచ్చారు. సాధారణంగా రాజమౌళి తన సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సినిమాకు సంబంధించిన ఏ మ్యాటర్ కూడా లీక్ అవ్వడం సహించరు.
కానీ  ఫృథ్వి  మాత్రం డేర్ చేసి బాహుబలి లో తన పాత్ర ఏమిటో చెప్పేసాడు. తాను కూడా సినిమాలో నటిస్తున్నానని, దేవసేన అనుష్కకు మంత్రిగా కనిపిస్తానని చెప్పాడు. రాజమౌళి తనకూ ఓ మంచి పాత్రను ఇచ్చాడని తెలిపాడు. ఇప్పటి వరకు తనను కమెడియన్ గా చూశారని బాహుబలి 2 లో మాత్రం చాలా సీరియస్ పాత్రలో కనిపిస్తానని అంటున్నాడు.  
 
Top