సోషల్ మీడియాలో కామెంట్లతో వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రొటీన్ కు భిన్నంగా స్పందించాడు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఖైదీ నెంబర్.150ని చూసిన వర్మ ఆ మూవీపై సంచలన కామెంట్లు చేశాడు. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ.. చిరంజీవి నటించిన ‘ఖైదీ నం.150’ చిత్రం వీక్షించారట. మొన్నటివరకు రీమేక్‌ సినిమాలో నటించారంటూ కామెంట్స్‌ చేసిన వర్మ ఇప్పుడు సినిమా చూడగానే ఒక్కసారిగా మెగాస్టార్‌ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. 
ఖైదీ నెం. 150 మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో నాగబాబు ఎపీసోడ్ నుంచి మెగాఫ్యామిలికీ వర్మకు మధ్య వేడి వాతావరణం కొనసాగింది. నాగబాబు వ్యాఖ్యలకు కౌంటర్‌గా వరుస ట్వీట్లతో వర్మ విరుచుకుపడ్డాడు. అయితే ఆ తర్వాత మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిరు మాట్లాడుతూ.. వర్మ నాకు అర్ధం కాడని అతనిది విభిన్న మనస్తత్వం అంటూ అభిప్రాయపడ్డాడు. రంజీవి నటించిన సినిమాను చూసిన తరువాత దానిని కీర్తిస్తూ ట్వీట్ చేశాడు. ఖైదీ సినిమా ఫెంటాస్టిక్ అన్నాడు.
చిరంజీవి ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉన్నాయని వర్మ అభిప్రాయపడ్డాడు. సినిమాల నుంచి విరామం తీసుకున్న తొమ్మిదేళ్లకు ముందు చిరంజీవి ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే తెరపై కనిపించారని ఆయన పేర్కొన్నాడు. వర్మ ఏం చేసినా తన మార్క్ ఉంటుందనడంలో సందేహం అక్కర్లేదు. బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగోడి చరిత్రను తెలిపే గొప్ప మూవీ అని ప్రశంసించిన రాంగోపాల్ వర్మ.. చిరు మాత్రం తమిళ మూవీ 'కత్తి'ని రీమేక్ చేశారని తీవ్రంగా విమర్శించాడు.
 
Top