నందమూరి నట సింహం బాలకృష్ణ కెరియర్ లో 100వ సినిమా సాధించిన ఘనత చాలా ప్రత్యేకమని చెప్పొచ్చు. శాతకర్ణి సినిమాతో బాలయ్య రేర్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో వారసుల హవా కొనసాగుతుంది. ఇక బాలకృష్ణ వారసుడు కూడా ఎంట్రీకి సిద్ధమని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తనయుడి ఎంట్రీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు బాలకృష్ణ.

ప్రస్తుతం మోక్షజ్ఞ సినిమాకు సంబందించిన అన్ని విషయాలను అబ్సర్వ్ చేస్తున్నాడని.. శాతకర్ణి సినిమాకు మోక్షజ్ఞ అసిస్టెంట్ డైరక్టర్ గా కూడా పనిచేశాడని చెప్పిన బాలయ్య. ఈ సంవత్సరం చివర్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని అన్నారు. అయితే ఫ్యాన్స్ మోక్షజ్ఞను లవర్ బోయ్ గా ఒప్పుకుంటారో లేదో అంటూ ఆసక్తి కరమైన కామెంట్స్ చేసిన బాలయ్య తన తర్వాత తన వారసత్వం అందిపుచ్చుకునే విధంగా మోక్షజ్ఞను తయారు చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు.

ఇక మోక్షజ్ఞ మొదటి సినిమా దర్శకుడు ఎవరో తెలియదు కాని నిర్మాతగా మాత్రం బాలయ్యతో లెజెండ్ సినిమా తీసిన సాయి కొర్రపాటి కన్ఫాం అయ్యాడు. ఇక దర్శకుడు కథ విషయాల పట్ల ఎటువంటి న్యూస్ బయటకు రాలేదు. తనయుడితో మాత్రం ఆదిత్య 999 సినిమా తీస్తానని చెప్పుకొచ్చారు బాలకృష్ణ. శాతకర్ణి సినిమా సక్సెస్ తో ఫుల్ ఖుషిగా ఉన్న బాలయ్య తనయుడి సినిమా పట్ల చేసిన వ్యాఖ్యలు నందమూరి ఫ్యాన్స్ ను భలే ఎంటర్టైన్ చేస్తున్నాయి. 
 
Top