పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ ‘కాటమరాయుడు’ కు సంసంబంధించి ఒక ఆశక్తికర విషయం ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాను కోలీవుడ్ మూవీ ‘వీరమ్’ ను కొన్ని మార్పులు చేర్పులు చేసి  తెలుగు వాతావరణానికి అనుగుణంగా పవన్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని మన సాంప్రదాయానికి తగ్గట్టు మార్పులు  చేసి తీస్తున్న విషయం తెలిసిందే. 

పవన్ కోసం ఈ సినిమా కథను మారుస్తున్నప్పటికీ తమిళంలోని అసలు కథ దెబ్బతినకుండా ఈమార్పులు చేసారు.  ఇప్పటికే  ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పవన్‌ పోస్టర్లు పవన్ అభిమానులకు బాగా నచ్చాయి. నార్త్‌ స్టార్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకం పై శరత్‌మరార్‌  కిషోర్‌ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ కు సంబంధించిన ఒక ముఖ్య విషయం బయటకు వచ్చింది. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమా కథ తమ్ముళ్ళ బాగోగుల్ని కాంక్షిస్తూ ఒక అన్నయ్య ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు ? తను ప్రేమించిన యువతి కుటుంబానికి ఎలా అండగా నిలిచాడు ? అనే యాంగిల్ లో సాగుతుంది. పవన్ ఇందులో మిడిలేజ్డ్ ఫ్యాక్షనిస్టు పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీలో పవన్ కు నలుగురు అన్నదమ్ములుంటారు.

అయితే ఈ సినిమా కథకు చాలా మార్పులు చేర్పులు చేసిన తరువాత ఈ సినిమా కథ గతంలో  జగపతిబాబు హీరోగా వచ్చి హిట్టైన 'పెద్దరికం' ఛాయలతో తయారు అయింది అన్న ప్రచారం జరుగుతోంది.  ‘పెద్దరికం’ సినిమాలో కూడ హీరో అన్నకు ఆడవాళ్లంటే పడదు. పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. అయితే అతడి నలుగురు తమ్ముళ్లు మాత్రం ప్రేమలో పడతారు. ఇప్పడు అదే ఛాయలో ‘కాటమరాయుడు’ కథ సాగుతుంది అన్న ప్రచారం ఊపు అందుకుంది. 

అయితే  జగపతి బాబు నటించిన ‘పెద్దరికం’ మూవీ ఛాయలు కనిపించకుండా 'కాటమరాయుడు' కథ రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ చుట్టూ అల్లినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్తలు ఇలా లేటెస్ట్ గా వెలుగులోకి రావడంతో పవన్ అభిమానులు తాము ఎన్నో తాము ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘కాటమరాయుడు’ సినిమా కథ పై జగపతి బాబు సినిమా ఛాయలు ఏమిటి అని తల పట్టుకుంటున్నట్లు టాక్.. 
 
Top