తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మెగా ఫ్యాన్స్ కి మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో  బ్లాక్ బ్లస్టర్ హిట్ తో ముందుకు వచ్చారు.  భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలు అందుకుని ఇటు ఫ్యాన్స్ నే కాక సినీ లవర్స్ ను కూడా అలరిస్తోంది. తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ చేసిన సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అభిమానులను మెప్పించిన మెగాస్టార్ రీ ఎంట్రీలో బాస్ ఈజ్ బ్యాక్ ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగా మూవీ ఖైదీ నెంబర్ 150 కలెక్షన్ల రికార్డులు బద్దలు కొడుతున్నారు.  బాస్ ఈజ్ బ్యాక్‌..బాక్సాఫీస్ షేక్‌. ఇది ఖైదీ తొలి రోజు రికార్డుల ప‌రంప‌ర‌.

ఒక్క రోజు బాస్ మూవీ క‌లెక్ష‌న్లు రికార్డుల‌ను బ్రేక్ చేసింది. ఆంధ్రా, సీడెడ్‌, నైజాం క‌లిసి 30 కోట్లు గ్రాస్ వ‌సూలు చేసి… స్టార్‌డ‌మ్‌లోనూ, క‌లెక్ష‌న్ల వేట‌లోనూ మెగాస్టార్‌ను బాస్‌గా నిల‌బెట్టింది. తొలిరోజు షేర్‌ 23.24 కోట్ల‌తో ఖైదీ మూవీ త‌న స‌త్తా చాటుకుంది. ఓవ‌ర్సీస్‌లోనూ 12,51,548 డాల‌ర్లు వ‌సూలు చేసి బాహుబ‌లి త‌రువాతి స్థానంలో నిలిచింది. ఇది మ‌న క‌రెన్సీలో 8.56 కోట్లు.  త‌మిళ మూవీ క‌త్తిని రీమేక్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడే…టైటిల్ త‌న హిట్ మూవీ ఖైదీ నెంబ‌ర్ 786 క‌లిసొచ్చేలా ప్లాన్ చేశారు.
150 సినిమాగా తెలియ‌డానికి వీలుగా ఖైదీ నెంబ‌ర్ 150గా నామ‌క‌ర‌ణం చేశారు. మ‌రోవైపు రీ ఎంట్రీ అర్థం మూవీ టైటిల్ ట్యాగ్ లైన్‌లోనూ స్ఫురించేలా బాస్ ఈజ్ బ్యాక్ అని పెట్టారు. పాట‌ల్లోనూ బాస్ వ‌స్తున్నాడంటూ హింట్ ఇచ్చారు. బీ, సీ సెంటర్లలో సినిమా బాగా పర్‌ఫామ్ చేయడంతో బాహుబలి కాకుండా ఇతర చిత్రాల పేరిట వున్న కొన్ని రికార్డులని 'ఖైదీ నెంబర్ 150' చిత్రం తన సొంతం చేసుకుంది.
ఏరియా వైజ్ కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం : 20.35 

ఆంధ్రా :38.50

సీడెడ్ : 10.45

టోటల్ ఏపి + నైజాం : రూ. 69.30 కోట్లు

ఓవర్సీస్ : 22.10

కర్ణాటక : 12.40

రెస్టాఫ్ ఇండియా : 2.30

టోటల్ వరల్డ్ వైడ్ : రూ.106.12 కోట్లు (గ్రాస్)
 
Top