సినిమా ప్రపంచంలో టార్జన్ అనే పేరు వినే ఉంటారు మొట్ట మొదటి సారిగా హాలీవుడ్ లో ఈ క్యారెక్టర్ తో సినిమాలు తీశారు. అడవిలో ఉంటూ జంతువుల మధ్య ఒక బాలుడు పెరిగి పెద్ద అయిన తర్వాత టార్జన్ గా మారి చెట్ల కొమ్మలు పట్టుకొని ఊగుతూ కనిపిస్తాడు. అప్పట్లో అంటే ఎనభైవ దశకంలో ఈ సినిమాలకు భలే క్రేజ్ ఉండేది.  తర్వాత టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో ఈ సినిమాలు చాలానే వచ్చాయి.

నథాలియాకౌర్ తో రానా రొమాన్స్

 

టార్జన్ అనగానే కండలు కలిగి ఒంటిపై బట్టలు లేకుండా ఆకులు చుట్టుకొని కనిపిస్తాడు. తాజాగా టార్జన్ సినిమాలను బాలీవుడ్ లో మళ్లీ తీయడానికి సన్నాహాలు చేస్తున్నారట. మరి ఈ టార్జన్ ఎవరా అనుకుంటున్నారా మరెవరో కాదు ఆరడుగుల ఆజాను భాహుడు రానా ఈ సినిమాలో నటించడానికి అంగీకారం తెలిపినట్లు తెలుస్తుంది.

 ఈ సినిమాలో రానాతో రొమాన్స్ చేసే యువతిగా సన్నీ లియోన్ నటించనుంది . ఇప్పటివరకు ఈ ఇద్దరినీ సెలెక్ట్ చేసినట్లు సమాచారం . ఈ ఇద్దరి మద్య బోలెడు శృంగార సన్నివేశాలు ఉండనున్నాయని ఇక కొన్ని సీన్ల లో బట్టల్లేకుండా కనిపించనున్నారని తెలుస్తోంది .

 

 
Top