తానూ సినిమా రంగంలోకి వచ్చిన తోలి రోజులలో తనను ఇంకా ఏదో కావలి అంటూ దర్శక నిర్మాతలు తెగ వేదిoచేవారని సంచలన వ్యాఖ్యలు చేసింది కృతి సనన్. ఇప్పుడు ఆమె మాటలు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారాయి. ఈరోజు ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి ఈ వ్యాఖ్యలు చేసింది.   

‘‘నువ్వు అందంగా ఉన్నావు కానీ, ఇంకా అందంగా ఉంటే బాగుంటుంది’’ అంటూ తాను సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్ లో పాల్గోనేడప్పుడు చాలామంది కామెంట్స్ చేసవారని ఆమాటలు విని తనకు తీవ్ర నిరుత్సాహం కలిగేదని షాకింగ్ కామెంట్స్ చేసింది కృతి. అయితే తాను తన తొలి హిందీ సినిమా ‘హీరో పంతి’, తెలుగులో తొలి చిత్రం ‘1. నేనొక్కడినే’ నటించిన తరువాత దర్శక నిర్మాతల మాట తీరులో మార్పు వచ్చిందని అభిప్రాయ పడింది కృతి.

కొత్త అమ్మాయి అవకాశాల కోసం సినిమా రంగానికి వచ్చినప్పుడు ఎదో ఒక వంకలు పెడుతూ నిరుత్సాహ పరుస్తారని ఆ వంకలను మరియు కామెంట్స్ ను తట్టుకునే శక్తి ఉన్న వారు మాత్రమే సినిమా రంగానికి రావాలి అంటూ సలహాలు ఇస్తోంది కృతి. 

అయితే తన అందంలో లోపాలు వెతికిన వాళ్ళు తనకు పెద్ద సినిమాలలో అవకాశాలు రావడం మొదలు పెట్టిన తరువాత ‘నువ్వు సూపర్  గొప్ప అందగత్తెవి’ అంటూ కామెంట్ చేయడమే కాకుండా ఒకప్పుడు మాధురీ దీక్షిత్ జుత్తు బాగుండక పోయినా పెద్ద స్టార్ హీరోయిన్ అయింది. అదేవిధంగా నువ్వు కూడ స్టార్ హీరోయిన్ అవుతావు అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారని అసలు విషయాన్ని బయట పెట్టింది కృతి. అయితే తన కెరియర్ తన తొలినాళ్ళలోని విమర్శలు ఇప్పటి ప్రశంసలు రెండు తనకు అర్ధంకాని ప్రశ్నలుగానే మిగిలి పోయాయని షాకింగ్ కామెంట్స్ చేసింది కృతి..
 
Top