లెజెండ్ సినిమా హిట్ తర్వాత అదే తరహాలో హీరోయిజం చూపిస్తు వస్తున్న
బాలయ్య సినిమా ‘లయన్’ ఈ రోజు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ
చిత్రంలో బాలయ్య సీబీఐ ఆఫీసర్ పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా మొదలైనప్పటి
నుంచి ఒక రూమర్ మీడియాలో వస్తుంది బాలకృష్ణ సీబీఐ పాత్ర వైఎస్ జగన్ కేసులో
ముప్పతిప్పలు పెట్టిన జెడీ లక్ష్మీనారాయణ తరహాలో ఉంటుందని అంతే కాదు
బాలయ్య పంచ్ డైలాగులు జగన్ ను విమర్శిస్తూ వేసినవే అని రూమర్ కూడా
ప్రచారంలో ఉంది.